మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఎనర్జీ.. దానికి మాస్ పల్లెటూరి కథ తోడైతే రికార్డులు బద్దలవ్వాల్సిందే. తాజాగా సుకుమార్ శిష్యుడు శ్రీనివాస్ మాయ చెప్పిన ఒక ఇంటెన్స్ విలేజ్ డ్రామా చిరుకు బాగా నచ్చిందట.ఈ కథ రామ్ చరణ్ ‘రంగస్థలం’ కంటే పవర్ ఫుల్ గా ఉంటుందని, చిరును ఒక ఊరమాస్ గెటప్‌లో చూపిస్తుందని సమాచారం. లెక్కల మాస్టర్ సుకుమార్ శిష్యుడు కావడంతో, స్క్రీన్ ప్లే లోడ్స్ ఆఫ్ ట్విస్టులతో ఉండబోతోందట. ఇప్పటికే కథ విన్న మెగాస్టార్, చిన్న చిన్న మార్పులు చెప్పి ప్రాజెక్టును దాదాపు ఓకే చేసినట్లు తెలుస్తోంది.
చిరంజీవి స్పీడ్ చూస్తుంటే 70 ప్లస్ వయస్సులో కూడా 17 ఏళ్ల కుర్రాడి ఎనర్జీ కనిపిస్తోంది. చిన్న సర్జరీ తర్వాత కొంత విశ్రాంతి తీసుకున్న ఆయన, వచ్చే నెల నుంచి తిరిగి సెట్స్ పైకి రాబోతున్నారు.విశ్వంభర: వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ఈ సోషియో ఫాంటసీ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. 2027 సంక్రాంతి లేదా సమ్మర్ టార్గెట్‌గా బాబీ కొల్లి డైరెక్షన్‌లో మరో భారీ ప్రాజెక్ట్ లైన్ లో ఉంది. ‘దసరా’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన శ్రీకాంత్ ఓదెలతో కూడా ఒక ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యింది. ఇలా చిరు తన లైనప్‌ను 2028 వరకు పక్కాగా సెట్ చేసుకున్నారు.వరుసగా యంగ్ డైరెక్టర్లకు ఛాన్సులు ఇస్తూ తన బాక్సాఫీస్ స్టామినాను మరో లెవల్‌కు తీసుకెళ్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి