సైబర్ నేరంలో అరెస్టయిన బి.జె.,పి నేత

సామాజిక మాధ్యమాలలో ఎట్లపడితే అట్ల పోస్టులు పెడితే ఊచలు లెక్కించక తప్పదు. ఈ విషయం పాపం ఆ అధికార పార్టీ నేతకు తెలిసినట్లు లేదు. కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉంది కాదా అనితను మాజీ ముఖ్యమంత్రి పై ఇష్టా రీతిన  వ్యాఖ్యానాలు చేశారు. దీంతో సైబర్ పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. కోర్టు ముందు హాజరు పరిచారు.  న్యాయమూర్తి ఆ జాతీయ నేతను  రిమాండ్ కు పంపారు.

అవమాన పరిచే రీతిలో  సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టిన భారతీయ జనతా పార్టీ జాతీయ్య నేత కళ్యాణరామన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈయన బి.జె.పి అనుబంధ సంస్థ భారతీయ మజ్దార్ సంఘ్ జాతీయ కార్యదర్శి కూడా. ఇతను కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాలలో తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిపై అవమాన కరమైన పోస్టులు క్రమం తప్పకుండా పెట్టసాగారు. దీనిని తొలుత  డి.ఎం.కె సభ్యులు పత్రికా ముఖంగా విమర్శించారు.  చనిపోయిన వారిపై  ఇష్టారీతిన నిందులు వేయడం తగదని డి.ఎం.కే నేతలు హితవు పలికారు. అయినా కేంద్రంలోమా పార్టీనే కదా అధికారం లో ఉంది అని కళ్యాణ రామన్ పత్రికా ముఖంగా వారికి సమాధానం చెప్పారు.  ఏమనుకున్నారో ఏమో..డి.ఎం.కే  కార్యకర్తలు కొంత కాలం ఇతడ్ని పట్టించుకోకుండా వదిలి వేశారు.  దీంతో కళ్యాణరామన్   తనదైన రీతిలోరెచ్చిపోయి మరీ పోస్టులు పెట్టసాగారు. దివంగత కరుణానిధితో పాటు,   తమిళనాడు లోని వి.సి.కె పార్టీ అధినేత,  సినీనటి, డాక్టర్ షర్మిలపైనా క్రమం తప్పకుండా విమర్శలతో కూడీన పోస్టులు పెట్టసాగారు.
ధర్మపురి పార్లమెంట్ సభ్యుడు  సెంథిల్ కుమార్,   వి.సి.కే పార్టీ న్యాయవాది  గోపీనాథ్ లు వేర్వేరుగా కళ్యాణ రామన్ పై  పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ జరిపి  కళ్యాణ రామన్ ను అరెస్టు చేశారు. సెక్టన్ నంబర్ 153(ఎ), సెక్షన్ 505(2) ప్రకారం కేసు నమోదు చేసి  కోర్టు ముందుకు హాజరు పరిచారు. కోర్టు ఇతనికి  రిమాండ్ విధించింది.
కళ్యాణ రామన్ 2016 లో ముస్లిం పై అభ్యంతర కరమైన వ్యాఖ్యలు చేసి ఓసారి అరెస్టయ్యారు.  ఆ తరువాత ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ  సామాాజిక మాధ్యమాలలో విమర్శలు చేసి మరో సారి అరెస్టయ్యారు. తాజాగా డి.ఎం.కే  పార్లమెంట్ సభ్యుడి ఫిర్యాదుతో మరలా అరెస్టయ్యారు. కళ్యాణ రామన్ సామాజిక మాధ్యమాలలో పెట్టిన  పోస్టులు  భారతీయ జనతా పార్టీకి సబంధం ఉండి ఉండక పోవచ్చని ఎం.పి సెంథిల్ కుమార్ పేర్కోన్నారు. కళ్యాణ రామన్ మానసిక స్థితిని  వైద్యులు ఒకసారి పరీక్షించాలని  వి.సి.కే పార్టీ  ప్రభుత్వాన్ని కోరింది.


మరింత సమాచారం తెలుసుకోండి: