ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇది వావాహం వరకు వెళ్లింది. వీరిద్దిరవి వేర్వేరు కులాలు అయినా వీరు వివాహం చేసుకోవాలని నిశ్చయించుకొని అనుకున్నట్టుగానే రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజుల తరువాత ఉన్నట్టుండి సాక్షియాదవ్ తాను వివాహం చేసుకున్నట్టు ఇంట్లో చెప్పింది. తన తండ్రి కోపంతో రగిలిపోయాడు. అంతేకాకుండా కూతురును పలుమార్లు వేధింపులకు గురిచేశాడు. ఈ నేపథ్యంలో ఇరువర్గాలతో మాట్లాడి పోలీసులు నచ్చజెప్పడంతో ఆ తండ్రి పెళ్లికి ఒప్పుకున్నట్టు నటించాడు. ఇంతలోనే కూతురు సాక్షియాదవ్‌ను హాస్టల్ నుండి ఇంటికి తీసుకొచ్చాడు. అదేవిధంగా కూతురని చూడకుండా కోపంతో రగిలిపోయి గుండు కొట్టించేసాడు. పుణ్యస్నానం కూడ చేయించాడు. దీంతో ఆ తండ్రి వేధింపులు తాళలేక సాక్షియాదవ్ ఇంటి నుంచి పారిపోయి తన భర్త వద్దకు చేరుకున్నది.
మహిళా పోలీస్ సూపరింటెండెంట్ సిమల ప్రసాద్‌కు సైతం ఫిర్యాదు చేసింది ఆ యువతి. 2020లో తాను దలిత యువకుడిని పెళ్లి చేసుకున్నానని, జనవరి 04, 2021న తండ్రికి తెలియజేసినట్టు వివరించింది. తండ్రి జనవరి 2021లో అదృశ్యమైనట్టు ఫిర్యాదు చేశాడని తెలిపింది. తనకు తన తండ్రి నుంచి ప్రాణహాని ఉందని ఆ యువతి తాజాగా పోలీసులకు వెల్లడించింది. తన భర్తకు విడాకులు ఇచ్చి, తమ కులానికి చెందిన వ్యక్తిని మరో వివాహం చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని, తమకు రక్షణ కావాలని పోలీసులను కోరినది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు మహిళా పోలీస్ సూపరింటెండెంట్ వెల్లడించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి