ప్రేమ.. మాటల్లో చెప్పలేని మధురానుభూతి..  చేతల్లో చూపించలేని గొప్ప అనుభూతి.. కేవలం మనసుతో చూసిన వారికి మాత్రమే అర్థమయ్యే ఒక ఫీలింగ్.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇక నాటితరం ప్రేమ గురించి చెప్పడం వదిలేసి నేటి రోజుల్లో ప్రేమ గురించి చెప్పడం మొదలు పెడితే అబ్బోపేజీలకు పేజీలు రాసియోచ్చు. ఎందుకంటే నేటి రోజుల్లో ఒక్కొక్కరిది ఒక్కోరకం ప్రేమ కథ. ఇక ఇటీవల కాలంలో కొన్ని చిత్రవిచిత్రమైన ప్రేమకథలు కూడా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అయితే ప్రేమ ఎంతో మంది యువకులను పిచ్చివాళ్ళను చేసింది. ఇంకెంతో మంది ని దేవదాసులను చేసింది.



 అదే ప్రేమ ఇక్కడ ఒక యువకుడిని ఏకంగా కిడ్నాపర్ ని చేసింది. అయితే యువతి మీద ప్రేమతో యువతిని కిడ్నాప్ చేశాడు అని అనుకుంటున్నారా.. కాదు కాదు యువతి కోసం ఏకంగా తనని తానే కిడ్నాప్ చేసుకున్నాడు.. తనని తాను కిడ్నాప్ చేసుకోవడం ఏంటి ఏదో కాస్త కొత్తగా అనిపిస్తుంది అని అనుకుంటున్నారు కదా.. కాస్త కొత్తగా చెత్తగా అన్ని రకాలుగా ఉంది ఇతగాడు చేసింది. ప్రియురాలి పాకెట్ మనీ కోసం ఏకంగా కిడ్నాపర్ గా మారిపోయాడు. ఇక ఎవరినో కిడ్నాప్ చేయడం ఎందుకని తనను కిడ్నాప్ చేసుకున్నాడు. అంతేకాదు సొంత తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ కొడుకు కిడ్నాప్ అయ్యాడు... అడిగినంత డబ్బులు ఇస్తే సరే లేదంటే మీ కొడుకు ప్రాణాలు దక్కవు.. అంటూ సినిమాల్లో విలన్ గా మాట్లాడినట్లుగా గొంతు మార్చు మాట్లాడాడు.



 అయితే కొడుకు ని కిడ్నాప్ చేశారు అని చెప్పేసరికి కంగారు పడిపోయారు తల్లిదండ్రులు. కానీ ఏం చేస్తాం వారిదగ్గర  అంత డబ్బు లేదాయే. ఏం చేయాలో తెలియక చివరకు పోలీసులను ఆశ్రయించారు. ఇక పోలీసులు రంగంలోకి దిగి ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఎక్కడో కాదు మధ్యప్రదేశ్లోని భీన్డ్ జిల్లా లోని  గో్హాద్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. ప్రియురాలి ఖర్చులు భరించలేక కొంత డబ్బు అవసరమై ఏకంగా తనను తాను కిడ్నాప్ చేసుకున్నాడు ఇక్కడ ఒక యువకుడు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి 2.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతని ఆచూకీ కోసం సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వెతికి గుర్తించారు. ఈ క్రమంలోనే యువకుడే కావాలని కిడ్నాప్ డ్రామా ఆడాడు అన్న విషయం బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: