ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఊహించని రీతిలో ఒక వ్యాను వేగంగా దూసుకు రావడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా అక్కడికక్కడే నలుగురు మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఇక్కడ జరిగిన ఘటన గురించి తెలుసుకున్న తర్వాత దేవుడి చేతిలో మనుషుల జీవితాలు కీలుబొమ్మలు అనడానికి ఈ ఘటన నిదర్శనం గా మారింది అని అనుకుంటున్నారు అందరూ. ఇంటిదగ్గర ఖాళీగా కూర్చున్న వారు చివరికి అనుకోని విధంగా ప్రాణాలు కోల్పోయారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. కుటుంబ సభ్యులు ఇంటి గడప లో కూర్చున్నారు . ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. కానీ వారి నవ్వు విధికి నచ్చ లేనట్టుంది. ఈ క్రమం లోనే వ్యాను రూపం లో మృత్యువు దూసుకొచ్చింది. గడప దగ్గర కూర్చున్న వారిపై ఒక వేగంగా దుసుకు రావడం తో ఈ ప్రమాదం లో నలుగురు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. మరి కొంత మందికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన కడప జిల్లా సికె దిన్నె మండలం మద్ది మడుగు లో జరిగింది. ఈ ఘటన తో ఇక ఆ ప్రాంతం లో ఒక్క సారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి