ఇంకా ఎంతో మంది తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నాయ్. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఏకంగా పాఠశాల బస్సే చిన్నారుల ప్రాణాలు తీసింది. ఈ ఘటనతో ఆ ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. విజయనగరం జిల్లాలో ఈ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాల బస్సు ఢీ కొట్టిన ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లా తెర్లాం మండలం పరిధిలోని టెక్కలి రావివలస వద్ద రహదారి పై ప్రైవేట్ పాఠశాల బస్సు వేగంగా వెళుతుంది. ఈ ఇక ఆ బస్సు ముందు ఉన్న ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది ప్రైవేట్ బస్సు.
అయితే ప్రమాద సమయంలో ఏకంగా ద్విచక్రవాహనంపై ఐదుగురు చిన్నారులు ప్రయాణిస్తూ ఉండడం గమనార్హం. ఇక బైక్ ఎగిరి పడిపోవడంతో చిన్నారులు రోడ్డుపై పడ్డారు. దీంతో తీవ్ర గాయాలపాలై చిన్నారుల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. ఇక చిన్నారులు అందరూ కలిసి జాతర కు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక మృతులు సిద్దు, హర్ష, రుషిగా గుర్తించారు. వీరందరికీ 9 ఏళ్ల లోపు వయసు ఉంటుందని చెప్పారు పోలీసులు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి