ఇటీవలికాలంలో మనుషులు పిరికివాళ్లాలా మారిపోతున్నారు. చిన్న చిన్న సమస్యలకే మనస్థాపంతో కుంగిపోతున్నారు. చివరికి అక్కడితో జీవితం అయిపోయింది అని భావించి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేవుడిచ్చిన ప్రాణాలను బలవంతంగా తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఓ వివాహిత మనస్థాపంతో నిండు నూరేళ్ళ జీవితానికి అర్ధాంతరంగానే ముగింపు పలికింది. ఈ సంఘటన బెంగళూరులోని చిక్కబల్లపుర లో వెలుగులోకి వచ్చింది. కోర్టులో ఉద్యోగిగా పని చేసే ఆరతి అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది.


 వివరాల్లోకి వెళితే.. ఆరతి  అనే 35 ఏళ్ల మహిళ నగరంలోని కోర్టులో ఎఫ్డీఏ గా పనిచేస్తుంది. బెంగళూరులోని చిక్కబల్లపుర లో ఉంటుంది. ఇక బెంగళూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్గా పని చేస్తూ ఉంటాడు ఆరతి రామకృష్ణయ్య. అయితే  ఇక భర్త బిడ్డలతో నివాసం ఉంటుండగా వీరికి దూరంగా ఓ  అద్దె ఇంట్లో ఉంటుంది ఆరతి. అయితే ఇటీవలే ఆరతి ఇంటి నుంచి బయటకు రాలేదు. దీంతో గమనించిన స్థానికులు తలుపు కొట్టి చూశారు. లోపలినుంచి తలుపు గడియ పెట్టి ఉండగా ఇంట్లో నుండి ఎవరూ స్పందించలేదు.


 దీంతో వెంటనే అనుమానంతో పోలీసులకు ఇక భర్త రామకృష్ణయ్య కు సమాచారం అందించారు స్థానికులు. ఇక వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూసి షాక్ అయ్యారు. ఏకంగా యువతి ఆరతి ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. ఇక ఆమె అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఇక అక్కడికి చేరుకున్న భర్త భార్య విగతజీవిగా కనిపించిన భార్యను చూసి తట్టుకోలేక పోయాడు. ఇక భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఆరతి చని పోవడానికి గల కారణాలు ఏంటి అన్న విషయాన్ని తెలుసుకునే పనిలో పడ్డారు ప్రస్తుతం పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: