దేవుడు ఇచ్చిన విలువైన ప్రాణాలను బలవంతంగా తీసుకుంటున్నారు. నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. క్షణికావేశంలో కొంతమంది తీసుకుంటున్న నిర్ణయాలు ఇక ఎన్నో కుటుంబాలలో అరణ్యరోదన మిగులుస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఎంతో మంది తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నాయ్. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. తమా కూతురికి పెళ్ళిచేసి ఒక అయ్య చేతిలో పెట్టామని ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోష పడి పోయారు. అత్తారింట్లో తమ కూతురు ఎంతో సంతోషంగా ఉంది అని అనుకున్నారు ఆ తల్లిదండ్రులు.
కానీ పెళ్లయిన రెండు నెలలకే ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఈ ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం తిమ్మాపురం లో వెలుగు లోకి వచ్చింది. వీరేశ్ అనే యువకుడితో రేణుక అనే యువతికి రెండు నెలల క్రితం వివాహం జరిగింది. అయితే రేణుక ఇటీవలే పుట్టింటికి వెళ్ళింది. మళ్లీ ఇక అత్తారింటికి తిరిగి వచ్చింది. కానీ కాసేపటికే దగ్గరలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో అటు రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇష్టం లేని పెళ్లి చేసిన కారణంగానే నవ వధువు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి