సాధారణంగా ఏ యువతి అయినా సరే పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటుంది. ఇక అత్తారింట్లో  కోటి ఆశలతో అడుగు పెడుతూ ఉంటుంది. ఇలా మెట్టినింట్లో అడుగుపెట్టిన తర్వాత అత్తమామలను తల్లితండ్రులుగా భావిస్తూ సేవ చేస్తూ ఉంటుంది. ఇక కొన్నాళ్ళ వరకు మెట్టినింట్లో కాస్త భయం భయం గానే ఉంటుంది నవవధువు. ఇక్కడ ఓ యువతి పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టింది. ఇక తమ కొడుకుకూ మంచి భార్య దొరికిందని ఆ తల్లిదండ్రులు ఎంతో సంబరపడిపోయారు. కోడలు చాలా తెలివిమంతురాలు అని భావించి ఆమె చెప్పినట్లుగానే వినడం మొదలు పెట్టారు.


 ఈ క్రమంలోనే ఆరోగ్యం బాగుండాలంటే రోజు పాలు తాగాలి అంటూ ఎంతో ప్రేమగా చెప్పింది కోడలు.  కోడలు అలా చెప్పిన తర్వాత ఊరుకుంటారా.. అత్తమామలు ప్రతిరోజు రాత్రి పాలు తాగడం మొదలు పెట్టారు. ఇలా మూడో రోజు రాత్రి కూడా పాలు తాగి పడుకున్నారు. కానీ పొద్దున్నే లేచి చూసే సరికి ఒక్కసారిగా షాక్.  కోడలు ఇంట్లో కనిపించకుండా పోయింది. దీంతో మొదట ఏం జరిగిందో అర్థం కాలేదు. కానీ ఆ తర్వాత మాత్రం ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాత అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో వెలుగులోకి వచ్చింది.



 కార్తీక్ చౌక్ లో నివాసముంటున్న సచిన్ తివారీకి మహారాష్ట్రకు చెందిన యువతీతో ఇటీవలే  వివాహం జరిగింది. ఇక అతనికి 40 ఏళ్ల వయసులో వివాహం జరగడం గమనార్హం. దీంతో కొంతమంది బంధువుల మధ్య ఈ వివాహ వేడుక జరిగిపోయింది. అత్తారింట్లో అడుగు పెట్టిన నవవధువు అత్తమామలను భర్తను ఎంతో ప్రేమగా చూసుకునేది. భోజనం వడ్డించడం తో పాటు రాత్రి పాలు కూడా ఇచ్చేది. ఇలా మూడు రోజుల పాటు అత్తమామలకు పాలు ఇచ్చింది. మూడో రోజు రాత్రి కోడలు ఇచ్చిన పాలు తాగిన అత్తమామలు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. పొద్దున లేచి చూస్తే 50 వేల నగదు బంగారు నగలు కనిపించలేదు. ఇక కోడలి ఫోన్ తో పాటు సంబంధం కుదిర్చిన వ్యక్తి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో మోసపోయామని గ్రహించి వెంటనే పోలీసులను ఆశ్రయించారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: