చదువుకోడానికి అమెరికా వెళ్లిన ప్రకాశం జిల్లా ఒంగోలు కు చెందిన యువకుడు చివరికి ఫిట్స్ రావడంతో అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన సంచలనం గా మారిపోయింది. ఇద్దరు కొడుకులను భర్తను కోల్పోయి ఒంటరిగా మారిపోయిన వివాహిత ఆవేదన చూపరుల అందరిని కూడా కంటతడి పెట్టించింది. నగరంలోని కొప్పోలు కు చెందిన దొండపాటి కార్తీక్ బీటెక్ వరకు ఒంగోలు లో చదివాడు. ఎమ్మెస్ చేయడానికి ఇక అమెరికాలోని చికాగో స్టేట్ లెవెల్ యూనివర్సిటీ కి వెళ్ళాడు. అప్పటికే చిన్న కుమారుడు భర్త మృతి చెందడంతో ఇక ఒక్కగానొక్క కొడుకు కార్తీక్ నీ మీదే ఆశలు పెట్టుకుంది తల్లి శోభారాణి.
ఇక్కడే ఉండి ఏదైనా చదువుకో గాని అంత దూరం వెళ్లీ నన్ను ఒంటరిని చేయకు అని తల్లి చెప్పినా వినకుండా కార్తీక్ అమెరికా వెళ్ళాడు. ఈ క్రమంలోనే అమెరికాలో ఉదయం 7 గంటల సమయంలో కార్తీక్ కు ఫిట్స్ వచ్చింది. అయితే ఎవరూ గమనించలేదు. దీంతో అలాగే కింద పడి పోయే మృతిచెందాడు కార్తిక్. ఇలా అమెరికా వెళ్ళిన రెండు నెలల్లోనే కొడుకు కన్నుమూయడంతో తల్లి ఆవేదన వర్ణనాతీతంగా మారిపోయింది. సరిగ్గా 15 ఏళ్ల క్రితం కూడా కుమారుడు శ్రీ రామ నవమి రోజు ప్రమాదానికి గురయ్యాడు. ఏడేళ్ల క్రితం భర్త రత్తయ్య కూడా కన్నుమూసాడు. ఇప్పుడు కార్తీక్ కూడా దూరం కావడంతో ఆ తల్లి అరణ్యరోదనగా విలపించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి