దేశం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంది. అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో ప్రపంచం మొత్తం వాలిపోతుంది. దీంతో ఇక ఆధునిక పోకడలకు పోతున్న మనిషి మూఢనమ్మకాలు అన్నింటినీ కూడా వదిలేస్తూ ఉన్నాడు. ఒకప్పటి చిత్రవిచిత్రమైన కట్టుబాట్లకు కూడా దూరంగా ఉంటూ ఆధునిక జీవనశైలిలోనే బ్రతుకును సాగిస్తూ ఉన్నాడు. ఇలా దేశం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతూ ఉంటే కొంతమందిమాత్రం ఇంకా మూఢనమ్మకాలు వెంటే అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఇలా మంత్రాలకు చింతకాయలు రాలుతాయ్ అని ఎంతోమంది నమ్ముతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఈ క్రమంలోనే క్షుద్రపూజలు మంత్రాలు చేస్తున్నారు అనే నెపంతో ఏకంగా మనుషులు మానవత్వాన్ని కోల్పోయి సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.  ఇటీవలి కాలంలో అక్కడ అక్కడ వెలుగులోకి వస్తున్న కొన్ని రకాల ఘటనలు అందరిని తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. నేటి ఆధునిక సమాజంలో కూడా ఇలాంటి ఘటనలు ఏంటి అంటూ అందరూ అవుతున్నారు. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది అన్నది తెలుస్తుంది. మంత్రాలు చేస్తున్నాడూ అనే నెపంతో ఆగ్రహించిన గ్రామస్తులు పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని దారుణంగా కొట్టి చంపారు.


 ఈ ఘటన మెదక్ లోని అల్లాదుర్గం మండలం లో వెలుగు లోకి వచ్చింది. పదోతరగతి చదువుతున్న జింక కృష్ణ అనే వ్యక్తి సెలవుల్లో మేకలు కాస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల గ్రామంలో మేకలు చనిపోవడం..  గడ్డివాములు తగలబడడంతో జింక కృష్ణ మంత్రాలు చేతబడి చేస్తున్నాడని గ్రామస్తులు నిలదీశారు. అయితే చేతబడి తనకు తెలియదు అంటూ చెప్పిన వినకుండా వేధించడంతో చివరికి కృష్ణ మనస్తాపంతో  గ్రామ శివారులోని ఒక చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉండటం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: