జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో విధి చిన్నచూపు చూడటం తో ఎంతోమంది అనుకోని విధంగా మృత్యువు ఒడిలోకి చేరుతుంటారు అన్న విషయం తెలిసిందే. అప్పటి వరకు సంతోషంగా ఉన్నవారు నిమిషాల వ్యవధిలో చివరికి ప్రాణాలను కోల్పోవడం లాంటి ఘటనలు కూడా వెలుగులోకి వస్తూనే ఉంటాయి. ఇక ఇలాంటి ఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో అయితే ఊహించని రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగి పోతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. అతను ఒక కిరానా షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే సరుకుల కోసం బయలుదేరాడు.


 అంతలో నేను కూడా వస్తాను నాన్న అంటూ అతని కొడుకు మారాం చేశాడు. దీంతో కొడుకును కూడా తనతో పాటే తీసుకెళ్లాడు. కానీ వీరు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని మృత్యువు రూపంలో దూసుకు వచ్చి కారు వెనకాలనుంచి ఢీకొట్టింది. తండ్రి కొడుకులు ఎగిరి పడ్డా రు. అంతేకాదు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.  ఈ ఘటన యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఇక సిసిటివి ఫుటేజీలో రికార్డైన వివరాల మేరకు మేడిపల్లిలో పెయింటర్ గా పనిచేసే రాములు ఇంటివద్ద కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు.


 ఇక ఈ కిరాణా షాప్ కోసం సరుకు తీసుకు వచ్చేందుకు బయలు దేరగా 11 ఏళ్ళ కొడుకు సోను నేను కూడా వస్తాను అంటూ మారాం చేశాడు. చివరికి తుమ్మ లోని గూడెం   సమీపంలోనే ఎస్సార్ పెట్రోల్ బంక్ వైపు మలుపు తిప్పే క్రమంలో యాచారం నుంచి వస్తున్న కారు వారిని ఢీకొట్టింది. ఈ క్రమంలోనే వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ క్రమంలోనే సంఘటన స్థలంలోనే  మృతదేహాలను ఉంచి ఆందోళనకు దిగారు బంధువులు. ఘటనకు కారణమైన కారు యజమాని నష్టపరిహారం చెల్లించిన తర్వాత మృతదేహాలను పోస్టుమార్టం కు తరలిస్తూ పట్టుబడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: