సాధారణంగా తండ్రి కూతుర్ల మధ్యప్రేమ అనుబంధం ఎంతో ప్రత్యేకం అని చెబుతూ ఉంటారు. నిజంగానే తండ్రి కూతుర్ల బంధాన్ని చూస్తూ ఉంటే అందరికీ ముచ్చటేస్తూ ఉంటుంది. కానీ ఇటీవలి కాలంలో మాత్రం కొంత మంది తండ్రులు ఏకంగా కూతుర్ల పాలిట శాపంగా మారిపోతున్నారు. పువ్వుల్లో పెట్టుకుని అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన కూతుర్లను దారుణంగా హింసిస్తున్న సంఘటనలు కూడా వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఒక యువతి కూడా తన గోడును వెల్లబోసుకుంది. తన తండ్రి వేధింపులు తట్టుకోలేక పోతున్నానని.. ఏ క్షణంలోనైనా ఆత్మహత్య చేసుకోవచ్చు అంటూ ముందుగానే సూసైడ్ నోట్ రాసి పెట్టింది ఆ యువతి.


 మా నాన్న మూర్ఖుడిలా ప్రవర్తిస్తున్నాడని హింసిస్తున్నాడని.. అమ్మ బ్రతికి ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు. కానీ ఆ తర్వాత మాత్రం మద్యానికి బానిస గా మారిపోయాడు అంటూ చెబుతోంది. తండ్రిని నాన్న అని పిలవడానికి కూడా అసహ్యం వేస్తుంది అంటూ చెప్పింది. మూడుసార్లు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఎవరో ఒకరు వచ్చి కాపాడారని.. ఇక ఎన్ని రోజుల్లో నా చావు వార్త వింటారు కూడా తెలియదు అంటూ చెప్పుకొచ్చింది ఆ యువతి. ఇక ఇటీవలే గతంలోనే ఉత్తరం రాసి పెట్టుకున్న యువతి పదవ  తరగతి పరీక్షలకు ముందు రోజు ఉరివేసుకుని తనువు చాలించింది.


 హృదయ విదారక ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం లో వెలుగులోకి వచ్చింది. ఓ గ్రామానికి చెందిన నరసింహులు, లలితా దంపతులకు కుమారుడు పదో తరగతి చదువుతున్న కుమార్తె మనీషా ఉన్నారు. లలిత ఏడాది క్రితం చనిపోవడంతో ఇక నర్సింహులు తాగుడుకు బానిస గా మారిపోయాడు. ఇంట్లో బాధితులను అసలు పట్టించుకునే వాడు కాదు. తరచు తాగొచ్చి కుమారుడు కుమార్తె తో గొడవ పడుతూ వేధించేవాడు. ఆ సమయంలో చెల్లెలు ఉరివేసుకుంది అంటూ కుమారుడికి ఫోన్ చేసి చెప్పాడు తండ్రి. ఇక అక్కడికి వచ్చి చూడగా పక్కనే ఉన్న పుస్తకంలో ఐ హేట్ మై డాడీ అంటూ నాలుగు సార్లు రాసి ఉంది. అయితే ఈ లేక గతంలో రాసినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: