ఇటీవలి కాలంలో మనుషుల్లో మానవత్వం పూర్తిగా కనుమరుగై పోయింది అనడానికి నిదర్శనంగా ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే సాటి మనుషుల విషయంలో జాలి దయతో ఉండాల్సిన వారు చివరికి ఉన్మాదులు గా మారిపోయి రాక్షసులుగా వ్యవహరిస్తున్నారు అని చెప్పాలి. కేవలం పరాయి వ్యక్తుల విషయంలోనే కాదు సొంత వారి విషయంలో కూడా ఇలాంటి జాలి దయ ఎక్కడా కనిపించడం లేదు. కట్టుకున్నవారు కన్నవారు రక్తం పంచుకుని పుట్టిన వారి విషయంలో కూడా జాలి దయ చూపించకుండా ప్రాణాలను గాల్లో కలిపేస్తున్న  ఘటనలు ఎన్నో సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.


 ముఖ్యంగా నేటి రోజుల్లో భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవలు ఎన్నో దారుణాలకు కారణం అయిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఏకంగా కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడు నీడగా నిలవాల్సిన భార్య భర్తలు బద్ద శత్రువులు గా మారిపోయి ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఏకంగా వెలుగులోకి వచ్చింది. వేగంగా భర్త భార్యను న్యాయస్థానం ముందే దారుణంగా గొంతు కోసి హత్య చేసిన ఘటన ప్రతి ఒక్కరికి భయాందోళనకు గురి చేసింది.


 ఈ ఘటన కర్ణాటకలోని హోలే నరసిపుర టౌన్ కోర్టు ప్రాంగణంలో వెలుగులోకి వచ్చింది. శివ కుమార్ అనే వ్యక్తి కి చైత్ర అనే అమ్మాయితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే కొన్నాళ్లపాటు అంతా సాఫీగానే సాగిపోయింది. కానీ అంతలోనే వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో కలిసి ఉండాల్సిన భార్యాభర్తలు చివరికి ఒకరి ముఖం ఒకరు చూడటానికి కూడా ఇష్టపడ లేదు. దీంతో దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే విడాకులకు దరఖాస్తు చేసింది భార్య చైత్ర. భర్త నుంచి భరణం ఇప్పించాలి అంటూ కోర్టులో కేసు వేసింది. ఈ క్రమంలోనే కోర్టులో హాజరయ్యేందుకు వచ్చిన శివ కుమార్ కోర్టు బయట భార్యను దారుణంగా గొంతుకోసి హత్య చేశాడు. అప్రమత్తమైన పోలీసులు చివరికి అతన్ని అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: