పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకం. ఈ క్రమంలోనే పెళ్లినీ మరింత ప్రత్యేకంగా మార్చుకోవడానికి నేటి రోజుల్లో యువత ఎంతో గ్రాండ్గా వివాహం చేసుకున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తల్లిదండ్రులు సంబంధం కుదుర్చుకుని వాళ్ళని లేదంటే తాము ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుని దాంపత్య జీవితంలో సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు. కాని ప్రతి ఒక్కరి విషయంలో పెళ్లి అనేది స్వీట్ మెమొరీ గా మిగలడం లేదు. తల్లిదండ్రుల ఒత్తిడి కారణంగా ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్న ఎంతోమంది చివరికి కట్టుకున్న వారితో సంతోషంగా ఉండలేక తమకు నచ్చిన జీవితాన్ని జీవించలేక ప్రతిక్షణం నరకంలో బ్రతుకుతున్నారు.


 వెరసి కొన్నాళ్లపాటు బాధను మనసులో దాచుకుని కుమిలిపోయిన వారు ఆ తర్వాత ఇక ఈ జీవితం వృధా అని భావించి ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. ఇలా తల్లిదండ్రులు ఒత్తిడి చేసి ఇష్టం లేని పెళ్లి చేశారు అని కారణంగా కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఆనందంగా పెళ్లి చేసుకుని దాంపత్య బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత అదనపు కట్నం కోసం  అత్తింటివారి  వేధింపులు తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు మరికొన్ని చోట్ల వెలుగులోకి వస్తున్నాయి.


 ఇలా కొంతమందికి పెళ్లి స్వీట్ మెమోరీస్ మిగిలిస్తే మరి కొంతమందికి మాత్రం విషాదాన్ని మిగులుస్తుంది. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. ఇష్టంలేని పెళ్లి చేశారనే కారణంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో వెలుగుచూసింది. శాంతి నగర్ కాలనీకి చెందిన శారదకు గోసంగి శ్యామ్సుందర్ తో ఐదు నెలల క్రితం పెళ్లి జరిగింది. శారదకు ఇష్టంలేని పెళ్లి చేశారు తల్లిదండ్రులు. పెళ్లయ్యాక అంతా సర్దుకుంటుంది అనుకున్నారు. కానీ కొండంత బాధను మనసులో దాచుకుని కుమిలిపోయిన శారదా చివరికి  ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: