ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక గొర్రెను ఏకంగా కోటి రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసేందుకు ఎవరైనా వస్తే.. గొర్రె యజమానులు ఏం చేస్తారు. అబ్బా లక్ష్మీదేవి కటాక్షం లభించింది అని భావించి కళ్ళు మూసుకుని ఆ గొర్రెను విక్రయించడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఓ గొర్రె యజమాని అలా చేయలేదు. కోటి రూపాయల ఆఫర్ ఇచ్చిన కూడా తాను పెంచుకుంటున్న గొర్రెను అమ్మెందుకు నిరాకరించాడు. దీంతో ఇక ఈ విషయం తెలిసి నేటిజన్స్ మాత్రమే కాదు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇది ఎక్కడో కాదు రాజస్థాన్లో చోటుచేసుకుంది అని చెప్పాలి.
చిరు జిల్లాలో కోటి రూపాయలు ఇస్తామని ఆఫర్ చేసిన గొర్రెను అమ్మెందుకు యజమాని నిరాకరించడం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది ఇంతకీ ఆ గొర్రె ప్రత్యేకత ఏమిటంటే.. ఆ గొర్రె పొట్టపై ఉర్దూలో 786 అనే ఆకారం ఉంటుంది. అయితే ఈ నెంబర్ ముస్లింలు ఎంతో పవిత్ర సంఖ్యగా భావిస్తారు అన్న విషయం తెలిసిందే. అయితే గత ఏడాది జన్మించిన ఈ గొర్రె ఇప్పటికే లక్షల రూపాయలు చెల్లించేందుకు ఎంతో మంది ముందుకు వచ్చిన.. అటు యజమాని మాత్రం అమ్మేందుకు ఒప్పుకోలేదు. ఇక ఇటీవల ఏకంగా గొర్రెకు కోటి రూపాయలు ఆఫర్ చేసిన కూడా యజమాని గొర్రెను అమ్మను అంటూ నిర్మొహమాటంగా చెప్పేశాడు. గొర్రెతో తనకు ఉన్న సాన్నిహిత్యం కారణంగానే దానిని అమ్మేందుకు నిరాకరించినట్లు ఆ గొర్రె యజమాని చెబుతున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి