ఇటీవల కాలంలో మనిషికి మరణం ఎప్పుడు సంభవిస్తుంది అని చెప్పడం అసాధ్యంగా మారిపోయింది. ఎందుకంటే అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకున్న సమయంలో అనూహ్యమైన ఘటనలు ఎంతోమంది ప్రాణాలను తీస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఇక ఇలాంటి తరహా ఘటనలు చాలానే వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే సంతోషంగా ఉన్న కుటుంబంలో విషాదఛాయలు అలుముకునేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కొవలోకి చెందినదే.


 రోజు బడికి వెళ్లి బుద్ధిగా చదువుకునే తమ కొడుకు ప్రయోజకుడు అవుతాడని ఆ తల్లిదండ్రులు ఎంతో ఆశ లు పెట్టుకున్నారు. ఇక తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టి ప్రయోజకుడ్ని కావాలనే పట్టుదల ఆ విద్యార్తిలో కూడా ఉంది  కానీ అంతలోనే విధి ఆ విద్యార్థి విషయంలో చిన్న చూపు చూసింది. చివరికి ఊహించని ప్రమాదం అతని ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఏకంగా తేలు కుట్టడం కారణంగా విద్యార్థి ప్రాణాలు వదిలాడు. ఈ విషాదకర ఘటన డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.


 చిత్తు పేపర్లు ఏరుతుండగా తేలు కుట్టడం తో ఉపాధ్యాయులు ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అయితే మెరుగైన చికిత్స కోసం కాకినాడకు తరలిస్తుండగా రక్తపు వాంతులు చేసుకుని విద్యార్థి చని పోయాడు. కపిలేశ్వర మండలం కోరుమిల్లికి చెందిన వై ప్రసాద్,  శ్రీదేవిల చిన్న కుమారుడు 14 ఏళ్ల అభిలాష్ 9వ తరగతి చదువుతున్నాడు. అయితే ఇటీవల తరగతి గదిలో చిత్తు పేపర్లు ఎక్కువగా ఉండడంతో మరో విద్యార్థితో కలిసి వాటిని ఏరుతుండగా.. అభిలాష్  చేతికి తేలు కుట్టింది. అయితే వెంటనే విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కాకినాడ కు తరలిస్తుండగా ఊపిరితిత్తుల్లోకి విషం చేరడంతో రక్తపువాంతులు చేసుకొని మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: