ఏంటో నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత జనాలు నిజాయితీగా ఉండడం మానేసి ఎలా మోసం చేయాలి అనే ఆలోచనతోనే ఉంటున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది. కాస్త అమాయకంగా కనిపించారు అంటే చాలు వాళ్ళని ఎలాగైనా బురిడీ కొట్టించి అందిన కాడికి దోచుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇలా ఎక్కువ డబ్బులు గుంజడానికి చిత్ర విచిత్రమైన రీతిలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆటో వాళ్ళు ఎంతలా చీట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సిటీకి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారు అని వాళ్లకు అర్థమైంది అంటే చాలు చివరికి అటు తిప్పి ఎటు తిప్పి జోబును గుల్ల చేస్తూ ఉంటారు.


 ఇంకొంతమంది ఏకంగా ప్రయాణికులను రెప్పపాటు కాలంలో మోసం చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఎప్పుడు ఒక ఆటో డ్రైవర్ చేసిన ఘనకార్యం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ వీడియో చూసిన తర్వాత ఇక బెంగళూరుకు వెళ్లి ఆటో ఎక్కాలి అంటే ఎంత అప్రమత్తంగా ఉండాలో అన్న విషయం ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది అని చెప్పాలి. బంగ్లాదేశ్ కు చెందిన ఒక వ్యక్తి బెంగళూరుకు వచ్చాడు. ఒక ఆటో ఎక్కాడు. కానీ ఆటో డ్రైవర్ రెప్పపాటు కాలంలో ప్రయాణికులను మభ్యపెట్టి డబ్బులు గుంజిన  ఘటనను సదరు వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.


 బంగ్లాదేశ్ కు చెందిన ఎండి ఫీజ్ అనే వ్యక్తి ఫీజ్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. ఇటీవల  భారత్లోని కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు వచ్చాడు. ఒక ఆటోలో ఎక్కాడు. అతని దిగాల్సిన ప్లేస్ రావడంతో డ్రైవర్ కు 500 ఇచ్చాడు. కానీ ఆటో డ్రైవర్ మీ ఛార్జి 300 అయింది మీరు 100 రూపాయలు ఇచ్చారు. మరో 200 ఇవ్వాలని చెప్పాలి. దానికి తానే పొరపాటు పడ్డానేమో అనుకుని ఆటో డ్రైవర్ నుంచి 100 రూపాయలు తీసుకొని మరో 500 నోటు ఇచ్చాడు. చిల్లర ఇవ్వబోతుండగా ఉంచుకోమని చెప్పాడు ఫీజ్. కానీ ఆటో డ్రైవర్ చేసిన మోసం ఫీజ్ ఇప్పుడు గుర్తించలేదు. తాను యూట్యూబ్లో పెట్టడం కోసం తీస్తున్న వీడియోలో మోసమంత రికార్డు అయింది. ఆ తర్వాత ఆ వీడియోను యూట్యూబ్లో అప్లోడ్ చేసే క్రమంలో జరిగిన మోసాన్ని గుర్తించాడు. ఇక ఇది చూసి అతను కూడా ఆశ్చర్యపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: