టెక్నాలజీ పెరిగిపోయింది. మనిషి జీవనషైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇక ప్రతి పనిని కూడా టెక్నాలజీని ఉపయోగించుకొని ఎంతో సులభంగా చేయాలని మనిషి ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే నేటి టెక్నాలజీ యుగంలో మనిషిలో మానవత్వం కూడా పూర్తిగా కనుమరుగైపోతుందేమో అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతుంది. ఎందుకంటే నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలే ఇందుకు కారణం  ఒకప్పుడు ముక్కు ముఖం తెలియని సాటి మనిషికి ఏదైనా సమస్య వస్తేనే అయ్యో పాపం అంటూ జాలిపడేవాడు మనిషి. కానీ ఇప్పుడు అడవుల్లో ఉండే మృగాల కంటే అత్యంత ప్రమాదకరంగా మారిపోతూ ఉన్నాడు. పైకి నవ్వుతూ కనిపిస్తున్న కుళ్లు కుతంత్రాలతో నిండిన మనసుతోనే ఉంటున్నాడు. ఇక నేటి సమాజంలో అయితే ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు ఎంతల పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆడపిల్ల ఒంటరిగా కనిపించింది అంటే చాలు ఏకంగా మగాళ్లు మృగాలుగా మారిపోయి దారుణంగా అత్యాచారాలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి  అయితే ఆడపిల్లలఫై వేధింపులకు పాల్పడిన వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకువచ్చిన పరిస్థితుల్లో మాత్రం ఎక్క రావడం లేదు అని చెప్పాలి. ఇలాంటి తరహా ఘటనలు అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి. ఆడపిల్లల రక్షణ ఇలాంటి ఘటనలతో రోజురోజుకు ప్రశ్నార్థకంగానే మారిపోతుంది.


 ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె పుట్టుకతోనే మూగ యువతి. అయితే దేవుడు తనకు ఇలాంటి లోపం ఎందుకు ఇచ్చాడా అని బాధపడకుండా ఇక జీవితాన్ని నెట్టుకొస్తుంది. అయితే ఇలాంటి మూగ అమ్మాయిపై కూడా కనీసం జాలి చూపించలేకపోయాడు కామాంధుడు. చివరికి లైంగిక దాడికి పాల్పడిన ఘటన తాండూరు మండలంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి పుట్టుక నుంచే మూగతో పాటు మతిస్థిమితం సరిగ్గా లేదు. అదే గ్రామానికి ఓ వ్యక్తి ఆ యువతీఫై లైంగిక దాడి చేశాడు. అయితే ఆ యువతి గర్భం దాల్చడంతో బాధితురాలు తండ్రి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: