ఎండాకాలం వచ్చిందంటే చాలు జనాలు అందరూ కూడా అల్లాడిపోతూ ఉంటారు. ఏసీల కింద కూర్చున్న కూడా ఇక ఎండవేడికి తట్టుకోలేక ఆగం ఆగం అవుతూ ఉంటారు. అయితే ఇలా ఎండాకాలం వచ్చిందంటే చాలు ఏసీలకు ఎలా అయితే గిరాకీ పెరుగుతూ ఉంటుందో.. ఇంకోవైపు మందు షాపులలో బీర్లకి అంతకు మించిన గిరాకీ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే భగభగ మండుతున్న సూర్యుడి వేడి ప్రతాపానికి ఉపశమనం లభించాలి అంటే చల్లని బీరు ఒకటే మార్గం అని అందరూ నమ్ముతూ ఉంటారు.


 దీంతో ఇక బీరు ప్రియులందరూ కూడా వేసవికాలంలో చల్లటి బీర్ తాగుతూ ఏకంగా అమృతం తాగినంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఏ వైన్స్ లో చూసిన బీర్లు ఎప్పటికప్పుడు ఖాళీ అవుతూనే ఉంటాయి. కొన్ని కొన్ని చోట్ల బీరు దొరకని పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వార్త వింటే మాత్రం ఏకంగా బీరు ప్రియులందరి గుండెలు గుబల్ మంటాయేమో. ఎందుకంటే బీరు ఫ్రీలు అందరికీ ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటారా..


 ఇక నుంచి బీర్ల కొరత ఏర్పడునుంది. గ్రేటర్ హైదరాబాద్ లోని బీర్ల తయారీ కంపెనీలు అన్నీ కూడా నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్నాయట. ఇక భూగర్భ జలాలు అడుగంటడంతో బీర్ల తయారీకి నీటి కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. వాస్తవానికి హైదరాబాద్ నగరంలోని బీర్లు తయారీ కంపెనీలకు రోజుకి 44 లక్షల లీటర్ల నీరు అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు అంత మొత్తంలో నీరు అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడింది. కాగా 1999 తర్వాత తొలిసారిగా బీర్ల తయారీపై ఎఫెక్ట్ పడినట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక ఎండాకాలంలో డిమాండ్ కు తగ్గట్లుగా బీర్లు సరఫరా చేయకపోతే మాత్రం ఇక అటు రేటు పెరగడమే కాదు బీర్ల కొరత ఏర్పడే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: