నేటి టెక్నాలజీ యుగంలో మనిషి జీవన శైలిలో ఎంతలా మార్పులు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ప్రతి పని చేయడానికి చెమటోడ్చి కష్టపడటం లేదు మనిషి. టెక్నాలజీని వినియోగించుకుని ఎంతో సులభంగానే అన్ని పనులను చేసేస్తూ వున్నాడు అనే విషయం తెలిసిందే. అయితే ఇలా టెక్నాలజీ జీవితంలో ఇలా మనిషి జీవనశైలిలో మార్పులు రావటం మంచిదే.. కానీ ఎందుకో మనిషిలో ఉన్నవిచక్షణ జ్ఞానం మాత్రం పూర్తిగా కనుమరుగైపోతుందేమో అనే భావన అందరిలో కలుగుతుంది. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకే మనిషి విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నాడు.


 అడవుల్లో ఉండే క్రూర మృగాలు మనుషులకంటే మేటర్ అనే విధంగా మనిషి ప్రవర్తన తీరు మారిపోయింది అని చెప్పాలీ. చిన్న చిన్న కారణాలకి ఏకంగా సాటి మనుషులను దారుణంగా హత్య చేస్తున్న ఘటనలు సభ్యసమాజంలో వెలుగులోకి వస్తూ అందరిని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి. చాక్లెట్ తిన్నంత ఈజీగా మనుషుల ప్రాణాలను తీసేస్తున్నాడు మనిషి. ఇక ఇటీవల మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో కూడా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. సాదరణంగా పాన్ షాప్ దగ్గర అందరూ సిగరెట్ తాగడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇక్కడ పాన్ షాప్ దగ్గర నిలబడి సిగరెట్ తాగడమే ఒక యువకుడి పాలిట శాపంగా మారిపోయింది. రంజిత్ రాథోడ్ అనే 28 ఏళ్ల యువకుడు ఇక సిగరెట్ తాగుతూ తననే చూస్తున్నాడు అనే కారణంతో నిందితురాలు అతనితో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలోనే స్నేహితులు ఆకాష్, జీత్ సహాయంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన రంజిత్ ను వెంబడించింది. ఇక మహాలక్ష్మి నగర్లో అతని గుర్తించి దారుణంగా కత్తితో దాడి చేసి హత్య చేసింది. పోలీసులు నిందితులను  గుర్తించి అరెస్టు చేయగా వారిలో ఒకరి ఫోన్లో  డ్రగ్స్ కు సంబంధించిన వివరాలను గుర్తించారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: