నేటి రోజుల్లో టెక్నాలజీకి అనుగుణంగా మనిషి జీవనశైలిని పూర్తిగా మార్చుకుంటున్నాడు. ఈ క్రమంలోనే టెక్నాలజీ మీద ఆధారపడుతూ ప్రతి పనిని కూడా సులభతరం చేసుకుంటున్నాడు. ఇలా వస్తున్న మార్పులు మంచికే అని పెద్దలు కూడా చెబుతున్నారు. కానీ మనుషుల్లో వస్తున్న కొన్ని మార్పులు మాత్రం సభ్య సమాజాన్ని భయపెడుతున్నాయి  ఎందుకంటే ఏకంగా మనుషులు మనుషులుగా కాదు మానవ మృగాలుగా మారిపోతున్న తీరు అందరిని ఉలిక్కిపడేలా చేస్తూవుంది. కామంతో కళ్ళు మూసుకుపోయి ఆడపిల్లలను ఆట బొమ్మలుగా చూస్తున్న మానవ మృగాలు దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు.


 వెరసి ఎన్నో దారుణమైన ఘటనలు వెలుగులోకి వస్తూన్నాయ్. దీంతో ఆడపిల్ల ఇక ఇంటి నుంచి కాలు బయటపెట్టాలి అంటేనే భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆడపిల్లల రక్షణ అనేది ప్రశ్నఅర్థకంగా మారిపోతుంది. అయితే ఇటీవల హైదరాబాద్ నగరంలో కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. సికింద్రాబాద్ తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పదహారేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు రాపిడో డ్రైవర్. ఇటీవల పోలీసులు అతని అరెస్టు చేశారు.


 తుకారం గేట్ పిఎస్ పరిధిలో నివాసముండే బాలిక తరచూ ఫోన్లో మాట్లాడుతుందని.. తల్లిదండ్రులు మందలించడంతో.. ఇంట్లో నుంచి పారిపోయింది. ఈ సమయంలో బాలికకు పరిచయమైన రాపిడో డ్రైవర్ సందీప్ రెడ్డి (28 ) మాయమాటలు చెప్పి తన బైక్ పై కాచిగూడ లోని ఒక లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ రూమ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. అయితే తర్వాత ఏం చేయాలో తెలియక బాలిక మళ్ళీ ఇంటికి చేరుకుంది. ఇక తల్లిదండ్రులు నిలదీయగా.. జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వాళ్ళు పోలీస్ లను ఆశ్రయించగా కేసు నమోదు చేసి సీసీటీవీ చెక్ చేయగా  నిందితుడు హబ్సిగూడ కు చెందిన రాపిడో డ్రైవర్ సందీప్ రెడ్డిగా గుర్తించారు. అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: