ఈమధ్య పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని సందర్శించడానికి జైలుకు వెళ్లడం జరిగింది. అయితే ఈ సందర్భంగా సిఐడి చీఫ్ సంజయ్ తో ఈ కేసు గురించి మాట్లాడారట. అప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు పెట్టిన 13సంతకాలను కూడా చూపించారట. నిజానికి క్యాబినెట్ అప్రూవల్ తో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ జీవోలో సీమెన్స్ సంస్థ అలాగే రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం అన్నట్లుగా ఉందని తెలుస్తుంది.


కానీ సీమెన్స్ సంస్థ తనకు సంబంధం లేదని చెప్పిందట. ఆ సీమెన్స్ సంస్థ నుండి ఒక్క రూపాయి కూడా డబ్బు రాలేదట. కానీ ఎందుకని సీమెన్స్  వీళ్ళతో ఒప్పందం అన్నది అంటే 90%-10% లెక్క ప్రకారం అని తెలుస్తుంది. అంటే సీమెన్స్ సంస్థ వాళ్ళు 90% గ్రానిటీ లాగా ఇస్తారంట. అంటే 3300 కోట్లు గ్రాంట్ గా అంటే ఉచితంగా ఇస్తారట. అంటే 10% రూపంలో 370 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలట.


అయితే ఇద్దరు కలిసి ఇలాంటి ఒక ఒప్పందం పెట్టుకునేటప్పుడు ఆ ఇద్దరిదీ కలిసి ఒక అకౌంట్లో పెట్టుకుంటారు. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు మాత్రమే రిలీజ్ చేసి డిజైన్ టెక్ కి ఇచ్చేశారట. అయితే నెల నెల ఇవ్వాల్సిన సొమ్ము అంతా కూడా డిజైన్ టెక్ కి ఒక్కసారే ఇచ్చేసారట. అయితే డిజైన్ టెక్ మా సంస్థ కాదనే చెప్పింది సీమన్స్. డబ్బులు అయితే సి ఎస్ ఆదేశాల మేరకు సీఎం గారు చెప్పారని రిలీజ్ చేసేసారని పి వి రమేష్ చెప్పారట.


ఆ డబ్బులు వెళ్లిపోయాక క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారట. అంటే 2015లో డబ్బులు డిజైన్ టెక్ కి వెళ్లిపోతే 2016 క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారట దానిపై.  వీటిపై చంద్రబాబు సంతకాలు కూడా పెట్టారు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్  వీటిని నమ్మారా, నమ్మలేదా అనేది  తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: