సొంతిల్లు కట్టుకోవాలంటే  పేద, మధ్య తరగతి వారికి తలకు మించిన భారం. ప్రతి ఒక్కరికి కూడు, గుడ్డ అనేవి ప్రాథమికావసరాలు. ఇప్పటికీ చాలా మందికి సొంత ఇళ్లు లేని వారు కోకోల్లలు. సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు నిరంతరం శ్రమించి పైసా, పైసా కూడబెట్టుకుంటుంటారు. కాన నేడు పెరిగిన ఖర్చుతో మధ్యతరగతి వారికి సొంతింటి కల కలగానే మిగిలిపోతుంది. ఈ నేపథ్యంలో వారి కలను నెరవేర్చేలని కేంద్రం యోచిస్తోంది.


సొంతింటి నిర్మాణానికి ప్రాధాన్యమిస్తూ బడ్జెట్ లో కీలక ప్రకటన చేసింది. నూతన గృహ నిర్మాణ విధానాన్ని తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ ప్రకటించారు. ప్రధాని మోదీ ఆవాస్ యోజన కింద దేశంలో మూడు కోట్ల ఇళ్లను నిర్మించామని.. దీనిని ఐదు కోట్లకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అంటే ప్రస్తుతం మరో రెండు కోట్ల ఇళ్లను నిర్మించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు.


పేదలకు మరో రెండు కోట్ల ఇళ్లను నిర్మించి ఇస్తామని బడ్జెట్ ప్రవేశ పెట్టే సందర్భంగా నిర్మాలా సీతారామన్ ప్రకటించారు. ఇది రియల్ ఎస్టేర్ రంగ అభివృద్ధికి దోహదం చేస్తోందని తెలిపారు. ఉపాధి కల్పనకు దారి తీస్తోందని.. ప్రాపర్టీ డెవలపర్లు, కన్సెల్టెంట్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కరోనా అవరోధాలు ఎదురైనా ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేశామని ఆమె ప్రకటించారు.


వాస్తవానికి ప్రధానిమంత్రి ఆవాస్ యోజన అనేది లక్షలాది మందికి సొంత ఇల్లు నిర్మించుకునేందుకు ఉపయోగపడిన పథకం. ఈ పథకం ద్వారా రూ.2.5లక్షల వరకు ప్రయోజనాలు అందుతాయి. అయితే ఇది పల్లెల్లోని పేదలకు మాత్రమే అందుబాటులో ఉంది. కానీ ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లోని పేద, మధ్య తరగతి కూడా దాని పరిధిలోకి తీసుకువచ్చారు. ప్రారంభంలో పీఎంఏవై కింద గృహ రుణం మొత్తం రూ.3 నుంచి రూ.6లక్షలు కాగా.. దానిపై సబ్సిడీ రాయితీ అందుబాటులో ఉంది. ప్రస్తుతం దానిని రూ.18లక్షలకు పెంచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: