లోక్ సభ ఎన్నికల్లో విజయం కోసం ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో 400కు పైగా సీట్లు సాధించి మరోసారి అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్న బీజేపీ.. ఈ మేరకు తన ప్రణాళికలు సిద్ధం చేసింది. మరోవైపు వరుసగా రెండు ఎన్నికల్లో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలని ఇండియా కూటమి ఏర్పాటు చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.


అయితే ఓటర్లును ఆకట్టుకునేందుకు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా ఆయా పార్టీలు తమ మ్యానిఫెస్టోలు విడుదల చేశాయి. కాంగ్రెస్ పార్టీ న్యాయ్ పేరుతో తమ మ్యానిఫెస్టోను ప్రజల ముందు ఉంచగా.. బీజేపీ సంకల్ప్ పత్ర (మోదీ గ్యారంటీ) పేరుతో తమ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది.


అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ.. ప్రజాకర్షక, వివాదాస్పద అంశాలకు దూరంగా బీజేపీ తమ లోక్ సభ మ్యానిఫెస్టోని విడుదల చేసింది. 10 సామాజిక సమూహాలు, 14 ప్రధాన అంశాలను దృష్టిలో పెట్టుకొని దీనిని రూపొందించింది. దేశంలో 80 కోట్ల మందికి పైగా పేదలకు ఉచిత రేషన్ ను మరో ఐదేళ్లు కొనసాగిస్తామని ప్రకటించారు. 70 ఏళ్లకు పైబడిన వృద్ధులను ఆయుష్మాన్ భారత్ లోకి తీసుకొచ్చి రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.


దీంతో పాటు మరో ముఖ్య హామీని బీజేపీ ప్రకటించింది. ముఖ్యంగా మహిళలకు ఇది చాలా ఊరటనిచ్చే అంశం. మహిళల కోసం జాతీయ రహదారి వెంబడి ప్రతి 20, 30 కిలో మీటర్లకు ఒక బాత్రూం తో పాటు.. సిటీల్లో కూడా వీరి కోసం ప్రత్యేకించి మోడ్రన్ టాయిలెట్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ విజయవంతంగా అమలు అయితే మహిళలకు చాలా వరకు ఇబ్బందులు తప్పుతాయి. దీంతో పాటు ఆరోగ్య కర సమస్యలు తలెత్తే అవకాశం ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజంగా ఇది ఒక గొప్ప హామీగా వారు అభివర్ణిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: