తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధానంగా మూడు పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కావడంతో.. ప్రభుత్వంపై అటు బీఆర్ఎస్, బీజేపీలు విరుచుకుపడుతున్నాయి. బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో కాంప్రమైజ్ అయ్యారని..  సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరతారని ఆరోపిస్తున్నారు.


ఇప్పుడు అంతా జంపింగ్ జపాంగ్ లే నడుస్తున్నాయి. ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలోకి ఇలా తిరుగుతూనే ఉన్నారు.  ప్రతిపక్షంలో ఉండటానికి ఏమాత్రం ఇష్టపడని నేతలు.. వెంటనే అధికార పార్టీ కండువా కప్పుకొంటున్నారు. ఇది సహజం అయినా.. ఇప్పుడు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ మారుతారు అంటూ తెలంగాణ లో కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది.  ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పోటెత్తుతున్నాయి.  


అయితే సీఎం రేవంత్ రెడ్డి పార్టీ మార్పు గురించి ఒకరిద్దరూ మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ.. బీఆర్ఎస్ ముఖ్య నేతలు మాజీ సీఎం కేసీఆర్.. కేటీఆర్, హరీశ్ రావులు మాట్లాడటం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. లోక్ సభ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ చేరికకు ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలు చూస్తే చాలా సిల్లీగా ఉన్నాయి. ఎందుకంటే 25 మంది ఎమ్మెల్యేలను తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ గూటికి చేరుతారు అని ఆరోపిస్తున్నారు.


దీనివల్ల ఉపయోగం ఏంటి. బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 8. ఏ రకంగా చూసుకున్నా ఇంకా 30మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.  అంటే  సీఎం పదవిని వదిలి వెళ్లి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో కూర్చొంటారా ? లేక బీఆర్ఎస్, బీజేపీ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రేవంత్ కాంగ్రెస్ లో చేర్చుకుంటుంటే.. ఆయన బీజేపీలోకి ఎందుకు చేరతారు. ఇది ఏ రకంగాను సాధ్యం కాదు. కేటీఆర్ మాట్లాడే ముందు ఓ సారి ఆలోచించుకుంటే మంచిది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: