ఏపీలో చావోరేవో అన్నట్లుగా తలపడుతున్న టీడీపీ కూటమి ఇప్పటికే చేయాల్సినవి అన్నీ చేస్తోంది. ఏపీలో అరశాతం ఓటు బ్యాంకు ఉన్న బీజేపీని తమతో కలుపుకోవడం వెనుక వ్యవస్థలను సానుకూలం చేసుకోవడం అన్న  ముందు చూపు ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉండగా ఏపీలో వివిధ జిల్లాల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఈసీ బదిలీ చేయించింది.


ఇది ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత జరిగే సాధారణ ప్రక్రియే అయినా.. బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసి మరీ వీరిని బదిలీ చేయించారు. ఏఏ చోట్ల అధికారులను మార్చాలి.. ఎవరినీ నియమించాలి అనే విషయంపై కూడా ఆమె తన లేఖలో వివరించారు. తాజాగా టీడీపీ కూటమి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అతి ముఖ్యమైన డిమాండ్ ని వారి ముందు పెట్టింది.


ఏపీలో ఎన్నికలు సజావుగా సాగాలంటే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి, డీజేపీని బదిలీ చేయాల్సిందే అంటూ కోరింది. వారిని కనుక ఇదే పదవుల్లో కొనసాగిస్తూ ఎన్నికలకు వెళ్తే మాత్రం అధికార దుర్వినియోగం కచ్ఛితంగా జరుగుతుందని పేర్కొనడం గమనార్హం. ఇప్పటికీ కొందరు అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వారిని తప్పించాలని వినతిలో పేర్కొంది. ఇంటెలిజెన్స్ ఐజీతో పాటు వివేక్ యాదవ్, రఘురామిరెడ్డిపై కూడా ఫిర్యాదులు చేశారు.


అయితే ఈ మేరకు పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇప్పటికే ఆయా అధికారులకు నోటీసులు జారీ చేశామని.. వారి వివరణ తీసుకొని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. కానీ ఎల్లో మీడియాలో మాత్రం బదిలీ జరిగిందనే వార్తలు రాసుకొస్తుంది. అంటే సమాచారం లేకండా కథనాలు రాయరు అని కొంతమంది నమ్ముతున్నారు. రానున్న రోజుల్లో ఏపీలో కచ్ఛితంగా డీజీపీ, సీఎస్ ల మార్పు ఉండబోతుందనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. మరి ఈ సంచలన నిర్ణయం దిశగా ఈసీ అడుగులు వేస్తుందా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: