హిందువులు అతి పవిత్రంగా భావించే వారి ఆరాధ్యనీయమైన హిందూ దేవాలయాలలోని విగ్రహాల పైన ఈ మధ్యన దాడులు జరుగుతుండడం పరిపాటిగా మారింది. దానికి దోషులు ఎవరయ్యా అంటే మందుబాబులుగా , పిచ్చి పట్టిన మందుబాబులగా చూపించడం ఏమాత్రం సమంజసం కాదు. ప్రజల, ప్రజల మనోభావాలకు సంబంధించిన సున్నితమైన విషయాలకు ఇబ్బంది కలిగించిన విషయాలను కూడా నీరుగార్చి ఇలా తేల్చేయడం బాధాకరం.


గతంలో రామతీర్థం లోని స్వామివారి శిరస్సు ఖండించిన కేసు విషయంలో ఇప్పటివరకు సాక్షులను తేల్చకపోవడం.. అది కూడా హిందూ అధికారులు ఉండి కూడా కేసులు పక్కదోవ పట్టడం.. విచారకరం. రథం తగలబడితే తేనెటీగలు అంటారు, విగ్రహాలు తగలపడితే పిచ్చోళ్ళ పని అంటారు.. తాజాగా ఆంజనేయస్వామి విగ్రహానికి నిప్పు పెట్టిన విషయంలో కూడా ఇది పిచ్చోళ్ళ పనే అని పోలీసులు ముందే తేల్చేయడం విచిత్రంగా ఉంది.


దీనికి ఉదాహరణగా కాకినాడ నగరం అచ్యుతాపురం రైల్వే గేట్ సమీపంలో ఉన్న ఆంజనేయస్వామి గుడిలోని స్వామివారి విగ్రహానికి నిప్పు పెట్టారని ప్రజలను తప్పుదోవ పట్టించే వార్తలను ప్రసారం చేయడం సరైనది కాదని,కాకినాడ డిఎస్పి మురళీకృష్ణ రెడ్డి స్పందిస్తూ మతిస్థిమితం లేని వ్యక్తి మద్యం తాగిన మత్తులో నిప్పు పెడుతుండగా స్థానికులు అడ్డుకున్నారని ఆయన చెప్పారు. మద్యం మత్తులోనో.. మద్యం పేరు చెప్పి ఏం చేసినా తప్పు లేదనే తప్పుడు స్టేట్మెంట్ ని సొసైటీకి అందిస్తున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి.


ఇలాంటి వివాదాలు చాలా సున్నితమైనవి.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు.. ఏదో ఒక విధంగా కేసులు క్లోజ్ చేద్దామన్న భావనతో కాకుండా.. నిజాయితీగా దర్యాప్తు జరిగితే.. అవి ఓ కొలిక్కి వస్తాయి. ప్రభుత్వం అన్ని ఘటనల్లోనూ పారదర్శకంగా ఉంటోందన్న భరోసా కలగడం అవసరం లేకుంటే.. అవి సమాజంలో కొత్త విభజనలకు, వివాదాలకూ దారి తీస్తాయి. జగన్ సర్కారు ఇక ముందు అలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: