ప్రజలకు తమ అభిప్రాయాలు చెప్పడం, ప్రజల్లోనే ఒక అభిప్రాయాన్ని కలిగించడం రెండిటికీ చాలా తేడా ఉంటుంది. కాంగ్రెస్‌లో గాంధీలు తప్ప దేశాన్ని పరిపాలించే వాళ్ళు ఎవరూ లేరు అనే ఆలోచన మనలోనే కలిగిస్తారు. పార్టీని నడిపించాలన్నా సరే గాంధీలు తప్ప ఇంకెవరూ నడిపించలేదు అనే మాట మనతోనే అనిపిస్తారు. అది వాళ్ళ వ్యూహం. భారతీయ జనతా పార్టీ గతంలో వ్యక్తి ఆధారిత రాజకీయాలు చేసేది కాదు‌. కేవలం పార్టీ ఆధారిత రాజకీయాలు మాత్రమే చేసేది.


కానీ ఈ పద్ధతి అధికారంలో రావడానికి తోడ్పడటం లేదని దానివల్లే అధికారానికి కూడా దూరం అవుతున్నామని తెలుసుకున్నాక అటల్ బీహార్ వాజ్ పేయిని ముందు పెట్టి రథయాత్ర చేసిన అద్వానీని రెండో ప్లేస్ లో పెట్టేసింది. తద్వారా మొట్టమొదటిసారి వ్యక్తి రాజకీయాన్ని మొదలు పెట్టేసింది భారతీయ జనతా పార్టీ. అటల్ బిహారీ వాజ్పేయి వయసు అయిపోతుందని తర్వాత అద్వానీని లైన్ లో పెట్టింది. దాని ఫలితంగా 2009 ఎన్నికల్లో, అది ఓటర్లకు నచ్చక బిజెపిని ఓటమిపాలు చేశారు.


దాంతో బీజేపీ తన పద్ధతి  మార్చి నరేంద్ర మోడీ అనే ఒక కొత్త ముఖాన్ని తీసుకువచ్చింది. అలా 2014కి మోడీని అందరూ ఆమోదించే విధంగా ప్రజల మనసుల్లో ముద్ర వేసింది. ఇండియా టుడే సర్వేలో కూడా, మొదటి ప్లేస్ లోకి మోడీనే వచ్చారు. ఇప్పుడు  యోగి ఆదిత్యనాథ్ ని కూడా మనకు తెలియకుండానే మనకు ఎక్కించేస్తుంది బిజెపి.


తెలంగాణలో కేసీఆర్ కూడా అలాంటి వ్యూహాన్నే అనుసరిస్తున్నారు. ఇదివరకు కేసీఆర్ తర్వాత ఆయన రాజకీయ వారసుడు హరీష్ రావు అనుకుంటే ఇప్పుడు అది కాస్తా కేటీఆర్ గా మారింది. హరీష్ రావు అనే వ్యక్తి కేవలం తన కుటుంబ సభ్యుడు మాత్రమేనని, తన రాజకీయ వారసుడు కేటీఆర్ అనే ప్రాజెక్టు చేస్తున్నారు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి కేటీఆర్ అయితే జాతీయ ముఖ్య నాయకుడు కేసీఆర్ అని మనసులో ముద్ర వేస్తున్నట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: