ఆర్థిక ఇబ్బందులు వచ్చినపుడు ఎలా ఎదుర్కొవాలో భారతీయులకు తెలుసు. చాలా మంది ఇండియన్లు ఆర్థికంగా కుదేలయిన సంఘటనలు ఉన్నప్పుడు వాటిని తట్టుకుని నిలబడేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు ఎదురైనపుడు ఏ అమెరికాలోనో, బ్రిటన్, యూరప్ దేశాల్లో ఉంటే ఎంత బాగుంటుందోనని అనుకుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. భారత్ లో ఇబ్బందులు పడి వాటిని తట్టుకుని నిలబడటం అలవాటే. కానీ యూరప్ దేశాల్లో ఉద్యోగాలు పోయి ఆర్థికంగా కుదేలై బిల్లులు కట్టలేని పరిస్థితి దాపురించింది.


ద్రవ్యోల్బణం పెరిగిన సమయంలో కూడా భారత్ లో కొంతమందికి మాత్రమే చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. మధ్య తరగతి వారు ఎక్కువ సఫర్ అయ్యారు. ఇప్పడు అమెరికా, బ్రిటన్, యూరప్ దేశాల్లో కరెంట్ బిల్లులు కట్టలేని దుర్బర పరిస్థితుల్లో ఉన్నారు. లాండ్రీ బిల్లు, ఇతర ప్రభుత్వ బిల్లులు చెల్లించలేక పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు.  వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని అంటున్నారు. బ్రిటన్ అయితే ఏకంగా 23 లక్షల మంది పెనాల్టీ కడతామని అంటున్నారు. అంటే ఎంతలా దిగజారిపోయారో తెలుస్తోంది.


ఒకప్పుడు ఆకాశ హర్య్మాలు, విలాసవంతమైన జీవితం, మంచి ఉద్యోగం, వీకెండ్ లో పార్టీలు మనిషి గా జన్మిస్తే ఇలాంటి ప్రదేశాల్లో పుడితే బాగుంటుందని భావించే పరిస్థితి నుంచి కనీసం కరెంట్ బిల్లు కట్టలేని విధంగా మారిపోయారు. అమెరికా, యూరప్ దేశాలకు పోవాలంటేనే వీసాకు ఎదురయ్యే ఇబ్బందులు, పోయిన తర్వాత ఉద్యోగం దొరికతే చాలు వాళ్ల లైఫ్ సెటిల్ అనుకునేవారు. ఇండియాలో అయితే అమెరికా, బ్రిటన్ వెళ్లిన వారికి ఎక్కువ కట్నం ఇచ్చి మరి పెళ్లి చేసే వాళ్లు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలయితాయంటే ఇదేనేమో విలాసవంతమైన జీవితం గడిపేవారు కరెంట్ బిల్లులు కూడా కట్టలేని దారుణ పరిస్థితుల్లో ఉన్నారంటే ఎంతలా ఆర్థికంగా కుదేలయ్యారో తెలుస్తోంది. మరి దీని నుండి బయటపడటానికి ఆయా సంపన్న దేశాలు ఎలాంటి ప్రయత్నాలు చేస్తాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: