
ఇండియాలో కూడా బిలియనీర్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. మలేషియాలో 86 శాతం మంది బిలియనీర్లు ఉంటే, ఇండియాలో 77 శాతం మంది బిలియనీర్ల సంఖ్య పెరుగుతుంది. ఇండోనేషియాలో 63 శాతం, వియత్నాం 59 శాతం, తైవాన్ 45 శాతం, హంకాంగ్ 24 శాతం, థాయ్ లాండ్ 30 శాతం, జపాన్ 18 శాతం బిలియనీర్లు పెరుగుతారని తెలుస్తోంది. ఎక్కువగా సంపాదనలో పడుతున్న వారు యువతే ఉండటం కూడా గమనార్హం.
ఎందుకంటే యువత ఎక్కువగా పని చేయడం వల్ల కొత్త కొత్త స్టార్టప్ కంపెనీలను స్థాపించడం, వాటిని విజయవంతంగా నడిపించడంతో సంపద చేకూరుతుంది. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో డబ్బులు సంపాదించడం అనేది ఒక కళ. యూట్యూబ్ చానల్ పెట్టుకుని లక్షల రూపాయాలు సంపాదిస్తున్న రోజులు ఇవి. ఇలాంటి సందర్భంలో గతంలో లాగా కాకుండా ఎక్కువ సంపాదించిన డబ్బులను దాచుకోవడం కాకుండా విలాసవంతమైన వస్తువులకు, భవనాలకు, జాగాలు కొనడానికి ఖర్చు పెడుతున్నారు.
ఒక విలాసవంతమైన విల్లా కొనుగోలు చేస్తే ఎంత ఖర్చయినా వెనుకాడటం లేదు. ఎందుకంటే దీని వల్ల హోదాగా ఫీలవడం ముఖ్యం. అలాగే ప్రశాంతంగా గడపడానికి కుటుంబంతో హాయిగా జీవించడానికి వీలవుతుందని నమ్ముతారు. కాలంతో పాటు మనుషుల మైండ్ సెట్ మారుతుంది. ఒకప్పుడు డబ్బులు ఎక్కువ సంపాదించి తరతరాలకు దాచిపెట్టెవారు. కానీ ఇప్పుడు విలాసవంతమైన జీవితం గడుపుతున్నామా లేదా అన్నదే ఆలోచిస్తున్నారు.