
ఏదైనా అంశాల్లో రెండు కోణాల్లో ఆలోచిస్తేనే ఆ అంశంపై పూర్తి అవగాహన వస్తుంది. ఇరు పక్షాల వాదనలు వింటే ఏది సహేతుకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే తెలుగుదేశం సోషల్ మీడియా వారు అమ్మకానికి సీఆర్డీఏ భూములు ఉన్నాయని మంగళగిరి మండలం నవులూరు లో పది ఎకరాలు అమ్ముతున్నట్లు ఎకరా రూ. 5.90 కోట్లు అప్ సెట్ ధర నిర్ణయించినట్లు పేర్కొన్నారు. తుళ్లూరు మండలం పిచ్చుకలపాలెంలో మరో నాలుగు ఎకరాలు అమ్మకానికి ఉంది. అది రూ. 5. 40 కోట్లకు పైగా అప్ సెట్ ధర నిర్ణయించినట్లు తెలిపారు.
రాజధాని భూములు వేరే వాటికి అమ్మవద్దని గతంలో హైకోర్టు తీర్పు నిచ్చింది. ఈ విషయాన్ని టీడీపీ వారు బయటపెట్టడం ఎందుకంటే ఎక్కడ భూములను అమ్మేస్తారోనని భయంతో సోషల్ మీడియాలో ప్రచారం తెగ చేసేస్తోంది. ప్రభుత్వం కోర్టుల్లో వాదించడానికి ఒక రూట్ దొరికినట్లయింది. రాజధాని భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉంటుంది. ఇదే చంద్రబాబు గతంలో భూమి అమ్మినపుడు సెల్ప్ అసైన్ మెంట్ భూములని వాటి అమ్మవచ్చని చెప్పారు. జగన్ ప్రభుత్వం అమ్మితే మాత్రం రాజధాని భూములను అమ్మేస్తున్నారని విపరీతమైన ప్రచారం చేసేస్తున్నారు.
అంతకుముందు ఉన్న ధరలు ఇక్కడ లేవు. కాబట్టి కొనేవారు లేరు. వచ్చే వారు లేరు. అందుకే పాత నగరాలనే కొత్త రాజధానులుగా మార్చుకుంటామనే లాజిక్ ను జగన్ ప్రభుత్వం వాడనుంది.