అదానీ షేర్ వాల్యూలు పడిపోయినా ఆయన కంపెనీలో ఉద్యోగాలు అన్ని అలాగే ఉన్నాయి. సొరొస్, గేట్స్ పౌండేషన్, హిండెన్ బర్గ్ నివేదికలు అదానీ కంపెనీలకు షేర్లు రాకుండా కంపెనీ నష్టపోయే విధంగా ఎన్ని చేయాలో అన్నింటిని చేస్తుంది. ఇప్పటికే అదానీ కంపెనీలు నష్టపోయే విధంగా హిండెన్ బర్గ్ నివేదిక ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ప్రపంచంలో టాప్ మోస్ట్ బిజినెస్ లీడర్ అయినా మొబియన్ క్యాపిటల్ వ్యవస్థాపకుడు కొన్ని కీలక వ్యాఖ్యలను చేశాడు. భారతీయ ఆర్థిక రంగంలో కీలకంగా మారుతున్న అదానీ గ్రూపులపై హిండెన్ బర్గ్ కావాలనే అతి చేసిందన్నారు.


బిజినెస్ టుడే తో ఆయన మాట్లాడుతూ.. అదానీ గురించి షార్ట్ సెల్లింగ్ వ్యాపారంలో ఉన్నట్లయితే ఇలాంటి ఆరోపణలు చేయడం సహజం. కానీ అదానీ గ్రూపు గురించి హిండెన్ బర్గ్ నివేదికలు పూర్తి కచ్చితమైనవి అనుకోనన్నారు. అదానీ గ్రూపు సంస్థల్లో కుటుంబ పెత్తనం ఉందన్న మాట వాస్తవమే అయినా దానితో వచ్చే ప్రమాదం ఏమీ లేదన్నారు. అదానీ గ్రూపులు వెల్లడించిన అన్ని విషయాలు అందరికీ తెలిసిన విషయమే. కొన్ని గ్రూపుల్లో రుణస్థాయిలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వ్యాపారాలు ఎంత ఎక్కువగా ఉన్నా అంతే స్థాయిలో వ్యాపారాలు అదానీ కంపెనీలకు ఉన్నాయి.


ఇలాంటి సమయంలో అప్పులు కూడా ఎక్కువగా తీసుకుంటారు. ఇక్కడ అప్పులు తీసుకునే సమయంలో కచ్చితమైన వ్యాల్యూ కాకుండా అటు ఇటుగా కచ్చితంగా జరుగుతూ ఉంటుంది. కానీ దీన్నే పెద్ద దొంగతనం చూపించడానికి హిండెన్ బర్గ్ నివేదిక ప్రయత్నించిందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే భారతదేశంలో వ్యాపారులు, వ్యాపార సంస్థలపై విదేశీ పెట్టుబడిదారులు, సంస్థల కన్ను పడిందనే అదానీ ఉదంతంతో అందరికీ తెలిసిందే.


సొరెస్, హిండెన్ బర్గ్ లాంటి నివేదికలు తయారు చేసి వాటిని మార్కెట్ లో కి వదులుతారు. అందులో నిజనిజాలు ఏంటి అనేది అవసరం లేకుండా ఇండియాలో ఎక్కువగా నమ్మడం వల్ల అదానీ షేర్లు కుప్పకూలాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: