విశాఖ లోని సీతకొండకు వైఎస్సార్ గా పేరు మార్చింది రాష్ట్ర ప్రభుత్వం. సీతకొండ ఉన్న వ్యూ పాయింట్ పేరు ను వైఎస్సార్ గా మార్చారని ఈనాడు తన ప్రధాన సంచిక లో రాసుకొచ్చింది. జోడుగొళ్ల పాలేం దగ్గర సీతకొండ ప్రాంతం అంటే విశాఖ నగరవాసులకు అందరికీ సుపరిచితమే.
ఈ ప్రాంతంలోనే మొన్నీమధ్య జీ 20 సదస్సు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సుందరీకణ చేపట్టి వైఎస్సాఆర్ గా పిలుస్తున్న విషయం తెలిసిందే అని సాక్షి తన పత్రికలో రాసుకొచ్చింది.


దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన పోస్టును సాక్షి తప్పు పట్టింది. చంద్రబాబు తన పోస్టులో అబ్దుల్ కలాం వ్యు పాయింట్ ను వైఎస్సాఆర్ గా పేరు మార్చారని ఆరోపించారు. దీనిపై సాక్షిలో చంద్రబాబును నిలదీశారు. అసలు అబ్దుల్ కలాం అనే పేరు లేదు. లేనిది ఉన్నట్లుగా అబద్దాలు ప్రచారం చేయడంలో  చంద్రబాబు తరవాతే ఎవరైనా అని రాసుకొచ్చారు.


అయితే.. సీతకొండను వైఎస్సార్ గా మార్చడాన్ని ప్రజలు తప్పు పడుతున్నారు. ముఖ్యంగా వైజాగ్ లో బీచ్ లకు ఎన్నో రోజుల నుంచి పేర్లు ఉన్నాయి. వాటిని ఎవరూ మార్చలేదు. ప్రస్తుతం ఇలా పేర్లు మార్చినంతా మాత్రాన పాత పేరు పోతుందా అని విమర్శలు చేస్తున్నారు గతంలో ఉన్న ప్రభుత్వాలు ఆర్.కె బీచ్, భీమిలి బీచ్, తదితర బీచ్ లు అవే పేర్లతో ఫేమస్ అయ్యాయి. వాటిని ఎవరూ మార్చడానికి ప్రయత్నం చేయలేరు.


కానీ బీచ్ లో వ్యూ పాయింట్ పేరు మార్చడంపై రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ నడుస్తోంది. టీడీపీ అనుకూల మీడియా, వైసీపీ అనుకూల మీడియా రెండు తెగ ట్రోలింగ్ చేసుకుంటున్నాయి. ఇలా ట్రోలింగ్ లతో ప్రజల్లో ఆయా పార్టీల వైఖరి బయటపడుతోంది. ఏదైనా ప్రాంతాన్ని డెవలప్ చేసినంత మాత్రాన దానికి తమ ఇష్టమైన పేరు పెట్టుకుంటా అంటే ఎలా అని ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: