ప్రపంచ దేశాలపై ఇప్పటికే అమెరికా దాదాపు 11 వేల ఆంక్షలు పెట్టినట్లు తెలుస్తోంది. యూరప్ దేశాలు కూడా ఈ ఆంక్షలకు మద్దతు తెలిపాయి. దీని వల్ల రష్యాను దెబ్బతీయాలని భావించింది. అయితే మొదట్లో యూరప్ దేశాలు దీనికి అంగీకరించాయి. తద్వారా రష్యా ఆర్థికంగా కుదేలై చెప్పిన మాట విని తలదించుకుని వస్తుందని భావించారు. ప్రస్తుతం ప్రపంచంలోనే సూపర్ పవర్ ఆర్థిక వ్యవస్థలు కలిగిన జీ 7 దేశాలు, మళ్లీ ఆర్థిక పరమైన ఆంక్షలు విధించాలని నిర్ణయం తీసుకోవాలని అమెరికా సూచించింది.


ఈ ఆంక్షలు ఏమిటంటే అమెరికా, యూరప్ దేశాల నుంచి ఎలాంటి వస్తువులను ఎగుమతి చేసుకోకూడదు. దిగుమతి చేసుకోకూడదు. ఇప్పటికే ఇలాంటి నిర్ణయం వల్ల యూరప్ దేశాలు తీవ్ర ఆర్థిక పరమైన ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పుడు పూర్తిగా రష్యా తో సంబంధాలు తెంపుకుంటే రష్యా నుంచి వచ్చే డిజీల్, పెట్రోల్ ఇతర సామగ్రి మొత్తం నిలిచిపోతాయి. తద్వారా మరింత ఆర్థిక సంక్షోభం తలెత్తి దేశాలు అడుక్కుతినే పరిస్థితి వస్తుంది. కాబట్టి యూరప్ దేశాలు అమెరికా చెప్పిన ఈ అంశంతో విబేధించాయి. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ యుద్దం వల్ల యూరప్ దేశాల్లో నిరుద్యోగం పెరిగిపోయింది.


చాలా వరకు ఆర్థిక కష్టాలు ఎదురవుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా బ్రిటన్ దేశంలో బ్రాండెడ్ బట్టలకు బదులు, సెకండ్ హ్యండ్ బట్టలను కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని దేశాల్లో ఈఏంఐలు కట్టలేని పరిస్థితి. ఇలా ఒక్కటేమిటి ప్రతి విషయంలో యుద్దం అనంతరం దాని పరిణామాలను యూరప్ దేశాలు చవిచూస్తున్నాయి. దీని వల్ల ఇప్పుడు అమెరికా ప్రతిపాదించిన ఎగుమతుల నిషేధంపై డైరెక్టుగానే స్పందించాయి. ఎగుమతుల నిషేధం అనేది కుదరదని తేల్చి చెప్పాయి. ఇదేదో రష్యాపై ఆంక్షలు విధించే ముందు నిర్ణయం తీసుకుంటే యూరప్ దేశాలు ఇంతలా ఆర్థికంగా కుదేలు కాకపోయేవి. ఇప్పటికైనా కళ్లు తెరిచినందుకు ఆయా దేశాల ప్రజలు సంతోషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

G7