ఉత్తర కొరియా, అమెరికా మధ్య మాటల యద్ధం తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే అణ్వస్త్ర దేశాల జాబితాలోకి వెళ్లామని చెప్పుకుంటున్న నార్త్ కొరియా అప్పుడప్పుడు దక్షిణ కొరియాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటుంది. దక్షిణ కొరియాకు ఉత్తర కొరియాకు అస్సలు పడని విషయం అందరికీ తెలిసిందే. సౌత్ కొరియాలో అమెరికా సైనిక విన్యాసాలు చేస్తోంది.


ఇప్పటి వరకు చేసిన ఉత్తర కొరియా చర్యల వల్ల విసిగిపోయిన అమెరికా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఒక్క అణు బాంబు గక ఉత్తర కొరియాలో కానీ దక్షిణ కొరియాలో కానీ పేలిందో నార్త్ కొరియా అధ్యక్షుడి శకం ముసిగినట్లేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు.


మొన్నటి వరకు అణ్వస్త్ర ఆయుధాలు ఉన్నాయని విర్రవీగిన నార్త్ కొరియాకు మింగుడు పడని విధంగా దక్షిణ కొరియాకు అణు వార్ హెడ్లను అమెరికా పంపింది. దీని వల్ల నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ ఏ మాత్రం తోక జాడించిన ఆ ప్రాంతంలో అణు యుద్ధం వచ్చేలా కనిపిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య వైరికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ దీంట్లో అమెరికా తల దూర్చి పెద్దది చేసేలా ఉంది.


నార్త్ కొరియాకు మొదటి నుంచి చైనా మద్దతు ఉంది. దక్షిణ కొరియాకు సపోర్టుగా నిలబడి అమెరికా యుద్దం చేస్తే చైనా నార్త్ కొరియా కు సపోర్టుగా నిలబడే అవకాశం ఉంది.  తైవాన్ కు సపోర్టుగా అమెరికా ఉంటోంది. ఇలాంటి సమయంలో చైనా తప్పక సపోర్టు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ యుద్దం గనక వస్తే అణ్వస్త్ర దాడి తప్పదు. రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన అణ్వస్త్ర దాడి తర్వాత జపాన్ లోని హిరోషిమా, నాగసాకి ప్రాంతంలో ఇప్పటికీ గడ్డి కూడా మొలవడం లేదు. గాలి కూడా కలుషితమైపోయింది. మరి ఇలాంటి సమయంలో నార్త్ కొరియాపై అమెరికా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

kim