మామూలుగా ఎలక్షన్స్ సమయంలో గతంలో అయితే బ్యాలెట్ ద్వారా మాత్రమే ఓటింగ్ జరిగేది. అయితే ఈ బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఎన్నికల్లో కొన్ని అవకతవకలు వస్తున్నాయని, దొంగ ఓటింగ్ జరుగుతుందని తెలిసి సిస్టం ని అప్డేట్ చేశారు అప్పుడు. అలా ఈవీఎంలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఎలక్షన్ల సెక్షన్ లోకి అరంగేట్రం చేశాయని తెలుస్తుంది. ఈ ఈవీయంలో ఓటింగ్ అనేది ఫింగర్ ప్రింట్ ద్వారా జరుగుతుండడంతో దొంగ ఓట్లకు ఆస్కారం ఉండదని క్లారిటీ అయితే వచ్చింది చాలామందికి.


అయితే ఈవీఎంల ద్వారా జరిగే ఓటింగ్ లో కూడా అవకతవకలు ఏర్పడుతున్నాయని వాదించే వాళ్ళు లేకపోలేదు అది ఎంత నిజమైనా, కాకపోయినా. సోరోస్ అనే సంస్థ తప్పుడు ప్రచారంతో జనాలని పక్కదోవ పట్టిస్తుందని అంటున్నారు కొంతమంది. ఇంతకీ ఆ సోరోస్ సంస్థ ఏం చెప్తుంది అంటే 2014లో ఈవీఎంలను మేనేజ్ చేసి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు.


రిలయన్స్ వాళ్ళు వాళ్ళ ఫ్రీక్వెన్సీ ద్వారా మార్చేసారని,అసలు ఆ డేటా వాళ్లకి కూడా తెలియదట ఎలా మార్చేశారో అని అంటున్నారు. 2014లో ఈవీఎం హాకింగ్ లో భారతీయ జనతా పార్టీతో రిలయన్స్ సహకరించిందని చెప్తున్నాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి సయ్యద్ సుజా అనే హ్యాకర్. రిలయన్స్ అతి తక్కువ తీవ్రత గల సిగ్నల్స్ ద్వారా డేటాను ఈవీఎం లోకి ట్రాన్స్ఫర్ చేసిందట.


ఈ పని చేస్తున్న సిబ్బందికి కూడా వాళ్ళు హ్యాకింగ్ చేస్తున్నారని తెలియదని ఏదో డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నారని మాత్రం అనుకున్నారని ఆ వ్యక్తి అన్నాడు. 2009 కాలంలో ఈసీఐఎల్ లో పనిచేసినందుకు ఈ విషయం తెలిసిందని ఆ వ్యక్తి చెప్తున్నాడని తెలుస్తుంది. అయితే ఈవీఎంలపై ఆరోపణలు కొత్త కాదు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా గతంలో ఇవే ఆరోపణలు చేశారు. వాటిని నిరూపిస్తామని కూడా చెప్పారు. ఆ తర్వాత ఆయన ఈ ఇష్యూని వదిలేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

evm