పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించింది అన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకు అంటే అక్కడ అధికార యంత్రాంగం రాత్రికి రాత్రి ఆరబెట్టిన ధాన్యాన్ని సేకరించడం కోసం వచ్చారన్నట్లుగా తెలుస్తుంది. గతంలో  చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా తడిసిన ధాన్యాన్ని సేకరించడానికి అధికార యంత్రాంగం  పరుగున వచ్చినట్లుగా తెలుస్తుంది.


మామూలుగా తడిసిన ధాన్యం ఎవరూ కొనరు. ఆ ధాన్యాన్ని మామూలుగా వేరే ధాన్యంతో కలిపినా కూడా ఆ ధాన్యం కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఆ ధాన్యాన్ని ఆరబెడుతూ ఉంటారు. ఆరపెట్టిన తర్వాతే వాడుతూ ఉంటారు. మరి ఎంత తేమ ఉంటే తీసుకుంటారు అనే ప్రశ్న వస్తే 17% తేమ ఉంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది అని తెలుస్తుంది. అంతకన్నా ఎక్కువ తేమ ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తుందని తెలుస్తుంది.


అయితే మొన్న చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంలో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టించుకొని మరీ కొన్నారు. కొంతమంది డైరెక్టుగా కొన్నారు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తున్నారనే మాట వినగానే అక్కడి రెవిన్యూ అధికార యంత్రాంగం హుటాహుటిన పరుగులు పెట్టుకుంటూ వచ్చింది. ఎవరు సూచించారో గాని వెంటనే అక్కడ ఉన్న దాన్ని అంతా రాత్రికి రాత్రి సచివాలయం ఉద్యోగులను పెట్టి మరి తీసుకువెళ్లిపోయారు.


రాత్రికి రాత్రి వచ్చి మరి అవతల వాళ్ళు రేపు పొద్దున ఇస్తామని చెప్పినా కూడా వినిపించుకోకుండా తీసుకువెళ్లిపోయారు. దానిని కొంతమంది కార్యకర్తలు అడ్డుకున్నారంట. పవన్ కళ్యాణ్ వస్తున్నారని చేస్తున్నట్లుగా లేదు అంటే, లేదు మేము రోజూ ఇలాగే తీసుకు వెళుతూ ఉంటాం అన్నారట. రోజు తీసుకు వెళ్ళే వాళ్ళు పగటి పూట తీసుకువెళ్తారు గాని, ఇలా రాత్రి పూట తీసుకువెళ్లరు కదా అని వాళ్ళు కొంతమంది అనుకున్నారట. అది కూడా రాత్రి 10 దాటిన తర్వాత. పవన్ కళ్యాణ్  మాట వినపడగానే ఇంత హడావుడి జరిగింది అక్కడ అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: