గతంలో తెలుగుదేశం పార్టీ ఇంటింటికి తెలుగుదేశం అనే పేరుతో జనాల్లోకి వెళితే వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలు ఏమి కనపడకపోవడంతో జనాలు నిలదీసిన పరిస్థితి ఏర్పడింది. దాంతో తెలుగుదేశం పార్టీకి తల ఎత్తుకోవాలని పరిస్థితి. ఒక పక్కన అమ్మ ఒడి అని, మరొకటి మరొకటి అని జగన్ సంవత్సరానికి 54,000చొప్పున సంక్షేమ పథకాలను ఇస్తూ ఉంటే, టీడీపీని ప్రజలు మీరేం చేశారు అన్నట్లుగా అడిగారట.


దాంతో చంద్రబాబు నాయుడు ఆలోచనలో పడ్డారట. ఇక 2024లో ఎలక్షన్లు రాబోతుండడంతో వాళ్లు కూడా తమ ఆలోచనను రిఫ్రెష్ చేసి ఇప్పుడు సంక్షేమ పథకాలను ప్రకటించే పనిలో పడ్డారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు చెప్పి పంపిస్తున్న ఇంటిలోని తల్లులకు, పిల్లలకు కూడా డబ్బులు ఇస్తాం అనే హామీ పైన విమర్శలు వస్తున్నట్లుగా తెలుస్తుంది.


అయితే ఇప్పుడు తెలుగుదేశం యొక్క హామీలపై వైయస్ఆర్సీపీ శ్రేణులు టార్గెట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రజలకి గతాన్ని గుర్తు చేస్తూ  చంద్రబాబు నాయుడు ని పూర్తిగా నమ్మలేం. రైతు రుణమాఫీ 85000 కోట్లు చేస్తామని చెప్పి చివరికి 15,000కోట్లు చేశారు. అలాగే డ్వాక్రా రుణ‌ మాఫీ అని ముందు నుండి చెప్పుకుంటూ వచ్చి చివరికి పసుపు కుంకుమలు అని సర్దేశారని మహిళలకు గుర్తు చేస్తున్నారట.


రైతు రుణమాఫీ, వ్యవసాయానికి 9గంటల ఉచిత విద్యుత్తు, డ్వాక్రా రుణమాఫీ, బెల్ట్ షాపుల రద్దు, వితంతువులకు నెలకి ₹1000పింఛను, మహిళలకు లక్ష వరకు వడ్డీ లేని రుణాలు, పుట్టిన ప్రతి ఆడబిడ్డకు 25వేల వరకు డిపాజిట్, ప్రతి ఏడు డీఎస్సీ, నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేవరకు నెలకు ₹1000 -2000నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా అమలు చేయడం , 5సంవత్సరాలలో ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపు, వీటిలో కొన్ని జరిగాయి. కొన్ని జరగలేదు. కానీ ఇప్పుడు మాత్రం అన్ని హామీలు అమలు అయ్యేలా ముందుకు వస్తామని అంటున్నారట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు.

మరింత సమాచారం తెలుసుకోండి: