టీవీ9లో యాజమాన్యం మారి ఏడాది దాటిపోయింది. అయితే ఇప్పుడు ఆ ఛానల్‌లో ఇద్దరు సీనియర్ జర్నలిస్టుల మధ్య ప్రచ్చన్న యుద్ధం తారస్థాయికి చేరినట్టు మీడియా సర్కిల్లో ప్రచారం జరుగుతోంది.టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ గా ఉన్న రజనీకాంత్‌ ను ఆ స్థానం నుంచి తప్పించి ఆ బాధ్యతను మురళీ కృష్ణకు అప్పగించినట్టు వార్తలు వస్తున్నాయి.  రవిప్రకాష్  నిష్క్రమణతో అప్పటిదాకా అనామకులుగా ఉన్న రజనీకాంత్, మురళీకృష్ణ లకు లీడర్షిప్ లోకి రావడానికి అవకాశం వచ్చింది. తాజాగా ఈ ఇద్దరిమధ్య పవర్ ఫైట్ జరిగిందని టాక్ వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ఓ మెస్సేజ్‌ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. దాని ప్రకారం.. యాజమాన్యం మారిన కొత్తలో మురళీకృష్ణ కంటే రజనీకాంత్ బెటర్ లీడర్ గా టీవీ9 ని టేకోవర్ చేసిన కొత్త యాజమాన్యం ఫీలైంది. వెంటనే రజనీకాంత్ ని మేనేజింగ్ ఎడిటర్ గా  డిక్లేర్ చేశారు.  రవిప్రకాష్ ఉద్వాసన,  పోలీసు కేసులు, టీవీ9 సంస్థలో రవిప్రకాష్ వీర విధేయులని  హ్యండిల్ చేయడం వగైరా పోస్ట్ క్రైసిస్ ని రజనీకాంత్ మొత్తంగా బాగానే హ్యాండిల్ చేశాడు. దాదాపు యేడాదిపాటు రేటింగ్స్ చెక్కు చెదరలేదు. కరోనా కలికాలంలో సైతం కనీవినీ ఎరుగని  రేటింగ్స్ రావడం దేశ వ్యాప్త సంచలనమైంది. మురళీకృష్ణ  ఎన్ని వేషాలు  వేసినా  ఎన్ని నిష్టురాలాడినా, మిత్రులుగా  ఉన్న కొందరు కొలీగ్స్ ఎన్ని  కుట్రలు చేసినా ఓ పక్క కంటెంట్ ని చక్కబెడుతునే వాటిని కూడా రజనీకాంత్ గట్టి గానే  ఎదుర్కొన్నారు.

అంతా బాగానే ఉందని సంస్థలో పనిచేసే ఉద్యోగులు సంతోషపడ్డారు. కొత్త యాజమాన్యం ప్రతినిధి ఎంటరైన ఓ వ్యక్తి చాపకింద నీరులా  టీవీ9  స్వరూపాన్ని మార్చుకుంటూ పోయాడని విమర్శలు వస్తున్నాయి. మొదట్లో రజనీకాంత్ కి క్లోజ్ గా ఉన్నట్లు యాక్ట్ చేస్తూనే గ్రాడ్యుల్ గా రజనీకాంత్ ని ' షో పీస్ ' గా మార్చేసి  నోమోర్ చేసాడట. తన వ్యూహాల కోసం మురళీకృష్ణకు అధికారాలు కట్టబెట్టేలా  చేశాడట. మురళీకృష్ణ తెరమీదకు రావడం మరో పక్క అవుట్పుట్ తన మనుషుల్ని దింపడం మొదలైందట.

టీవీ9 ఫార్మాట్ తెలియని ఈ వ్యక్తులతో  రేటింగ్స్  కుప్పకూలాయి. తెలుగు ప్రజల కష్టానికి సంతోషానికి అండగా నిలబడ్డ టీవీ9 సజీవంగా, స్వతంత్రంగా ఉండటం ఒక చారిత్రిక అవసరం అంటున్నారు కొందరు టీవీ9 ఉద్యోగులు. వ్యక్తులను నిందించడం తమ ఉద్దేశ్యం కాదని.. కొంతమంది వ్యక్తుల వల్ల ఓ గొప్ప సంస్థ ధ్వంసం కావడం అన్యాయం అంటూ ఓ మెస్సేజ్‌ను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: