విజయనగరం కార్పొరేషన్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ రాజుల నగరం చరిత్రతో పాటు అనేక మార్పులు సంతరించుకుంది. విజయనగరానికి కార్పొరేషన్ హోదా వచ్చాక జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవి. ఇక్కడ మేయర్ స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించారు. అందుకే ఇక్కడ తొలి మేయర్ పీఠాన్ని  అధిష్టించే రాణి ఎవరన్నది ఉత్కంఠగా మారింది. ఒక్కసారి విజయనగరం ఓవరాల్‌ గణాంకాలు పరిశీలిస్తే.. 2011 జనాభా లెక్కల ప్రకారం విజయనగరంలో 2,44,598మంది జనాభా ఉన్నారు.  ఓటర్లు 2,02,214 మంది. మహిళలు 1,03,216మంది కాగా., పురుషులు 98,969 మంది.

ఇక గతేడాది ఎన్నికలు ప్రక్రియ నిలిచిపోయే సమయానికి దాఖలైన నామినేషన్లలో 77తిరస్కరించగా., 336 నామినేషన్లు ఆమోదం పొందాయి. కార్పొరేషన్ హోదాలో జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో టీడీపీ, వైసీపీ ప్రచారం ముమ్మరం చేశాయి. అభ్యర్ధులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓట్లు అభ్యర్తిస్తున్నారు. విజయనగరం మేయర్ అభ్యర్ధి ప్రకటన విషయంలో వైసీపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. టీడీపీ మాత్రం విజయనగరం మేయర్ పదవికి ఇప్పటికే  అభ్యర్ధిగా శమంతకమణిని ప్రకటించింది. మేయర్ తో పాటు కార్పొరేటర్ల కు ఓటర్ల మద్ధతు కూడగట్టెందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

మరోవైపు.. విజయనగరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో సత్తా చాటేందుకు జనసేన-బీజేపీ కూటమి కూడా ప్రయత్నిస్తోంది. మోదీ ప్రవేశపెట్టిన పథకాలు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఆధారంగా ప్రచారం చేస్తున్నారు జనసైనికులు . పోటీలో ఉన్న 33 స్థానాల్లో గెలుపు జండా ఎగరవేస్తామంటున్నారు జనసేన -బిజెపీ నేతలు.  ఒకసారి గత ఎన్నికల ఫలితాలు చూస్తే.. 2014 విజయనగరానికి మున్సిపల్ హోదాలో జరిగిన ఎన్నికల్లో ఆ నాటికి మొత్తం వార్డులు 40 ఉంటే తెలుగుదేశం పార్టీ 32 వార్డులను గెలుచుకుంది. కాంగ్రెస్ 05, వైకాపా 02, స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలుపొందారు. మరి ఇప్పుడు బలా బలాలు మారిపోయాయి. వచ్చే ఎన్నికల్లో సీన్ ఎలా మారుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: