ఈ మొత్తం వ్యవహారంతో క్రిస్టల్ క్లియర్ గా తేలేదేమంటే..ఇక కేసీఆర్‌కూ.. ఈటలకూ అతకదు.. ఈటల కూడా ఈ పరిణామాలను కొన్నాళ్లుగా గమనిస్తూనే ఉన్నారు. తనపై వేటు పడుతుందని ఆయనకూ తెలుసు. అయితే కేసీఆర్ టార్గెట్ చేసినా ఈటల ఎక్కడ నోరు జారడం లేదు. కేసీఆర్ పై నేరుగా విమర్శలు చేయడం లేదు. ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నారని మాత్రమే ప్రశ్నిస్తున్నారు. ఎదురుదాడి కి ఇంకా సమయం ఉందని ఈటల భావిస్తుండొచ్చు.
మరి ఈటల యాక్షన్ ప్లాన్ ఏంటి.. ఈటల పార్టీ పెడతారా.. లేక.. ఏదైనా పార్టీలో చేరతారా.. ఒంటరి పోరు సాగిస్తారా.. అన్నది తేలాల్సి ఉంది. ఆయన సొంత పార్టీవైపు మొగ్గు చూపుతున్నారని కథనాలు వస్తున్నాయి. అయితే ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా కూడా త్వరలోనే చేయవచ్చని తెలుస్తోంది. ఆయనే స్వయంగా ఆ మాట అన్నారు కూడా. మరి ఆయన రాజీనామా చేస్తే ఆరు నెలల్లోనే ఉపఎన్నిక వస్తుంది. అప్పుడు మళ్లీ ఆయనే పోటీ చేసే అవకాశం ఉంది.
ఇక్కడే ఓ రాజకీయ లాజిక్ ఉంది. ఆయన ఉప ఎన్నికకు ముందు పార్టీ పెడతారా.. ఉపఎన్నిక తర్వాత పార్టీ పెడతారా అన్నది కీలకం కానుంది. ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఉపఎన్నికకు వెళ్లడం కంటే.. ఉపఎన్నిక తర్వాత పార్టీ పెట్టడం బెటర్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే.. ఇప్పుడు ఈటలకు అనేకమంది మద్దతు ఇస్తున్నారు. అనేక పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయి. ఒకవేళ ఈటల పార్టీ పెట్టిన మరుక్షణమే ఈ మద్దతు ఆగిపోయే అవకాశం ఉంది.
అందుకే ముందు పార్టీ పెట్టకుండా.. ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఉపఎన్నికలో పోటీ చేస్తే.. కేసీఆర్ వ్యతిరేకవర్గమంతా ఈటల గెలుపు కోసం ప్రయత్నిస్తుంది. చివరకు విపక్షాలు కూడా లోపాయ కారీగా మద్దతు ఇస్తాయి. ఒకసారి ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ను ఓడించాక పార్టీ పెట్టినా అది విజయవంతం అయ్యే అవకాశం ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి