
సామాన్యుడిది ఈ దేశం అని ఎందుకు అంటున్నానో చెబుతాను..ఇలాంటి డొక్కు సైకిలే కదా ధీరూబాయ్ అంబానీని అంతటివాణ్ని చేసింది. ఇలాంటి డొక్కు సైకిలే కదా! రా మోజీ సర్ ను ఇవాళ అంతా రాజాజీ గురూజీ అని పిలిచేలా మూవీ మొగల్ ను చేసింది. సైకిల్ అతడి జీవితాన్ని మార్చింది అని రాయగలిగింది చెప్పగలిగింది ఎన్టీఆర్ విష యమై కదా! ఇలా ఎన్నో ఇంకా ఎన్నో!
మళ్లీ కథలోకి వద్దాం.. ఆ రైతు తనకు తెలిసిన తోచిన పద్ధతిలో రెండు పెద్ద క్యారియర్ల నిండా తన భార్యతో అల్పాహారం తయారు చేయించి, ఆ సెక్రటేరియట్ కు చేరుకున్నా డు.. అక్కడి లాన్ వద్దకు గోదావరి జిల్లాల నుంచి వచ్చే బస్సులు ఉంటాయి.. ఆ డ్రైవర్ల దగ్గర అరటాకులు కొనుగోలు చేసి ఇడ్లీ అమ్మడం మొదలు పెట్టాడు. రోజూ ఇదే పని చేశాడు.. ఉదయం వేళ..తన సుచీ శుభ్రత నచ్చీ చాలా మంది అక్కడికి చేరుకున్నారు. ఆ రైతును ఆదుకున్నారు. కొన్ని నెలలు ఆగాక ఆ రైతు అప్పులు తీరాయి.. ఊళ్లో పొలం తాకట్టు నుంచి బయటకు వచ్చింది. పిల్లలకో దారి దొరికింది. ఇంకా ఎన్నో.. ఒక డొక్కు సైకిల్ అతని జీవితాన్నీ ఆ కుటుం బాన్నీ అమితంగా మార్చింది. చెప్పానుగా ఈ దేశం సామాన్యుడిది.. వాడి కలలు మన క లలు వాడి జీవితం మన జీవితం. భాగ్య నగరం జీవితం ఇస్తుంది మనం పట్టించుకోకుండా తిరుగుతున్నాం అంతే!