``సార్ చెప్పారంటే జరగాల్సిందే. లేక పోతే.. మాకు ఇబ్బందే!` అనే రేంజ్‌లో ఆయా జిల్లాల్లో అధికారులు హడలి పోతున్నారు. ఎందుకంటే.. ఏ విషయం తేలాలన్నా.. ఏది జరగాలన్నా.. కూడా సదరు నాయకుల అనుమతి తీసుకోవాల్సిందే. అంతేకాదు.. వలంటీర్లనను మించి.. వ్యవహరిస్తున్నారట. నిజానికి వలంటీర్ల వల్ల తమకు గుర్తింపు లేకుండా పోతోందని.. ఎమ్మెల్యేలే వాపోతున్న నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేల బావమరుదులు.. ఒక మంత్రిగారి సోదరుడు తీవ్రస్థాయిలో చక్రం తిప్పుతున్నారు. ఏకంగా.. కడపలో అయితే.. వలంటీర్ల వాట్సప్ గ్రూప్‌ను ఆయనే మేనేజ్ చేస్తున్నారట.
ఈయన సీఎం జగన్‌కు స్వయానా బంధువు వరుస అయ్యే నాయకుడికి సోదరుడు కావడంతో ఎవరూ ఏమీ మాట్లాడలేక పోతున్నారు. తూర్పులో జగన్ వ్యాపారభాగస్వామిగా ఉన్న ఒక కీలక నాయకుడి సోదరుడు మరింత రెచ్చిపోతున్నారు. ఇక, పశ్చిమలో మంత్రిగారి బావమరిది.. ఒకరు అంతా తానే చక్రంతిప్పుతు న్నారట దీంతో పార్టీ తరఫున గెలిచిన నేతలు కూడా తమకు పనులు కావాలంటే.. సదరు నేతలను కాకా పట్టుకునే పరిస్థితి వచ్చిందని పెద్ద ఎత్తున చర్చ సాగుతుండడం గమనార్హం.
మరి దీనివల్ల తమకు నష్టం ఉంటుంది .. కదా.. అని అసలు నేతలుఏమీ బాధపడకపోగా.. తమ చేతలకు మట్టి అంటకుండా.. చక్కబెడుతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారట. వచ్చేది వస్తున్నప్పుడు.. తమకు మాత్రం చింత ఎందుకనే ప్రశ్న వస్తోంది. ఇదీ.. ఆయా జిల్లాల్లో సీఎంల తర్వాత.. సిఎంల మాదిరి జరుగుతున్న కార్యక్రమం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి