దీంతో మిగిలిన వారు 16 మంది. చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ పదహారు మంత్రి నేటి నుంచి సభలకు హాజరు కానున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. వీరిలో ఎంతమంది.. ప్రభుత్వాన్ని నిలదీస్తారు ? అనేది ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. చంద్రబాబు ఉన్నప్పుడే.. నలుగురు ఎమ్మెల్యేలు.. అంటీముట్టనట్టు వ్యవహరించారు. వీరిలో పశ్చిమానికి చెందిన ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఇక, అప్పట్లో అంటే.. చంద్రబాబు అన్నీ చూసుకునేవారు. కానీ, ఇప్పుడు ప్రత్యక్షంగా ఆయన సభలో ఉండరు.
సో.. పరోక్షంగానే ఆయన సభలో ఉంటారు. ఏదైనా వివాదం జరిగితే.. టీడీపీ నేతలు ఆవేశ పడితే.. సభ నుంచివీరిని పంపేయడం ఖాయం. దీంతో సభలో టీడీపీ వ్యూహం పారేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యూహానికి తగిన విధంగా నాయకులు ముందుకు నడిచేలా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆవేశకావేశాలకు పోతే.. మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. పటిష్టమైన కార్యాచరణ, పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగితే.. టీడీపీ ఆశించిన విధంగా సభలో సమయాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు.
కానీ, తమ్ముళ్లు అలా చేస్తారా ? ఆవేశం ప్రదర్శించకుండా.. వ్యవహరిస్తారా ? అనేది ప్రశ్న. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. ఓటీఎస్, చెత్తపై పన్ను, విద్యుత్ కోతలు, నిరుద్యోగం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలనే ప్రణాళిక వేస్తున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం రాజధాని విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో టీడీపీ అనుసరించే వ్యూహానికి ప్రాధాన్యం పెరిగిపోయింది. మరి ఏం చేస్తారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి