ఉక్రెయిన్‌పై దాడి తీవ్రం చేస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇక ఇప్పుడు నాటో దళాలపై దృష్టి సారించాడు. నాటో దేశాలను టార్గెట్ చేసిన పుతిన్ ఏకంగా అమెరికా లక్ష్యంగా కవ్వింపు చర్యలు ప్రారంభించాడు. యుక్రెయిన్ లోని కీలక నగరాలను ఇప్పటికే ధ్వంసం చేసిన పుతిన్‌.. తనకు  
ఏదో ఒక ఆటంకం సృష్టిస్తున్న అమెరికా, నాటో దేశాలపైనా దాడికి దిగబోతున్నట్టు తెలుస్తోంది. ఈ దేశాలు యుక్రెయిన్‌కు ఆయుధాలు పంపుతున్నందువల్ల వాటిపైనా పుతిన్ కక్ష కట్టాడు.


ఇప్పటికే నాటో దేశమైన పోలండ్‌పై కయ్యానికి పుతిన్ సిద్ధమవుతున్నాడు. యుక్రెయిన్‌, పోలండ్ సరిహద్దుల్లో బాంబుల మోత మోగిస్తున్నాడు. పోలండ్‌పై దాడి చేసి నాటోకు తన సత్తా చూపి హెచ్చరించేందుకు ప్రయత్నిస్తున్నాడు. మొత్తం మీద పుతిన్ వ్యవహారం చూస్తుంటే.. ఆయనకు  ఇప్పట్లో ముగించడం ఇష్టం లేనట్టే ఉంది. ఈ యుద్ధాన్ని ఉక్రెయిన్ పై దాడితో ఆపకుండా.. నాటో దేశాలను కూడా కవ్వించడం వెనుక ఉన్న పుతిన్ వ్యూహాన్ని అర్థం చేసుకోవడం మిగిలిన దేశాలకు కష్టంగా మారింది.


ఒకసారి నాటో దేశాలు నేరుగా యుద్ధ రంగంలోకి దిగితే.. ఆ  తర్వాత అది ఏ పరిణామాలకు దారి తీస్తుందో ఎవరూ చెప్పలేదు. అంతిమంగా అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే.. దీనికి నాటో దేశాలు ప్రస్తుతానికి సిద్దంగా ఉన్నట్టు లేవు. పుతిన్ మాత్రం యుక్రెయిన్‌కు మద్దతుగా ఆయుధాలు అందించిన అన్ని దేశాలను టార్గెట్‌ చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇక ఇప్పుడు నాటో దేశాలకు ఆప్షన్స్ తగ్గిపోతున్నాయి. రష్యా దూకుడు ఆపాలంటే.. అవి ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాను నిలిపేయాల్సి ఉంటుంది.


అలా ఆపడం ఇష్టం లేకపోతే ఇక నేరుగా ఆ దేశాలు కూడా రష్యాతో యుద్ధంలో ప్రత్యక్ష్యంగా యుద్ధంలో పాల్గొనాల్సి ఉంటుంది. అదే జరిగితే అది చాలా ప్రమాదకర పరిణామాలకు దారి తీస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో జరిగే పరిణామాలు కీలకం కాబోతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: