ఒక సర్వే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ ఆ సర్వే ఏంటి.. ఆ సర్వే చెప్పింది.. చూద్దాం.. ఆరా సంస్థ తరచూ ఎన్నికలపై సర్వేలు నిర్వహిస్తోంది. చాలా సార్లు ఈ సంస్థ నిర్వహించిన ఫలితాలు వాస్తవానికి దగ్గరగా వచ్చాయి. అయితే తాజాగా ఈ ఆరా సంస్థ సర్వే ఫలితాలను నిర్వాహకుడు మస్తాన్‌ విడుదల చేశారు. ఈ సర్వే ప్రకారం తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందట.


మరి ఇలాంటి ఫలితం వస్తే.. కేసీఆర్ కాళ్ల కింద భూమి ఎందుకు కదులుతుంది.. ఇదే కదా మీ సందేహం.. అవును.. ఇప్పటికిప్పడు ఎన్నికలు వస్తేనే ఆ ఫలితాలు.. కానీ.. ఎన్నికలు ఆలస్యమైతే మాత్రం సీన్ మారిపోయే అవకాశం ఉందని ఈ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఎందుకంటే.. ఈ సర్వే ఫలితాల్లో బీజేపీ చాలా వేగంగా పుంజుకుంటున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కే ఆధిక్యం సాధిస్తుందని చెబుతున్నా.. ఆ పార్టీకి వచ్చే ఓట్ల శాతం చూస్తే కేసీఆర్‌కు షాక్ తగలాల్సిందే.


టీఆర్ఎస్‌కు కేవలం 38.88 శాతం ఓట్లు వస్తాయని ఆరా సర్వే చెబుతోంది. అంటే 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే.. టీఆర్ఎస్‌ పార్టీకి ఓటింగ్  8 శాతం తగ్గుతుందన్నమాట. అలాగే ఇప్పుడు ఎలక్షన్ జరిగితే బీజేపీకి 30.48 శాతం ఓట్లు వస్తాయని ఆరా సర్వే అంచనా వేస్తోంది. అలాగే మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌కు 23.71 శాతం వచ్చే అవకాశం ఉందట. ఈ లెక్కల ను బట్టి చూస్తే.. గతంతో పోలిస్తే బీజేపీ ఓట్‌ షేర్ చాలా వేగంగా పెరుగుతోందట.


గత సర్వేలో బీజేపీకి కేవలం 10 శాతం లోపే ఓటింగ్ వస్తే.. ఈసారి మాత్రం ఏకంగా 20 శాతానికి పైగా ఓట్లు పెరిగాయి. మరి ఇదే వేగంతో బీజేపీ దూసుకుపోతే.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు బీజేపీ చెక్ చెబుతుందా.. కేసీఆర్ నుంచి అధికారం హస్త గతం చేసుకుంటుందా అన్నది ఇప్పుడు తెలంగాణలో వినిపిస్తున్న విశ్లేషణ. అయితే.. ఏదో ఒక సర్వేను పట్టుకుని ఇంత విశ్లేషణ చేస్తారా అంటూ టీఆర్ఎస్ నేతలు అప్పుడే సర్వేపై ఎదురు దాడి ప్రారంభించారు. కానీ.. కేసీఆర్ జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చిందని మరికొందరు విశ్లేషకులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: