అటు వివేకా కూతురు సునీత సీఎం జగన్ కు దూరమయ్యారు. సొంత చెల్లెలు షర్మిళ పార్టీ పెట్టుకుని తెలంగాణలో ఉంటూ జగన్ కు దూరంగా ఉంటోంది. ప్రస్తుతం ఒక్క వైఎస్ విజయమ్మ మాత్రమే జగన్ తో మాట్లాడుతున్నారు. ఇలా ఒక్కొక్కరు కుటుంబ సభ్యులు జగన్ కు దూరం అవుతున్నారు. ముఖ్యంగా వైఎస్ వివేకా హత్య కేసులో జగన్ దగ్గరి బంధువులు ఉండటం అనేది ఆయన్ని కలవరానికి గురి చేస్తోంది.
ముఖ్యంగా వైఎస్ వివేకా హత్య కేసు వెనకాల జరుగుతున్న విచారణలో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకోవడం జగన్ కు అంతు పట్టకుండా ఉంది. దీనికంతటికి కారణం జగన్ అని ఓ వైపు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇలా సొంత బాబాయ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కూడా సీఎం జగన్ కు దగ్గరి బంధువులు కావడం, ఒకరిని కాపాడితే మరొకరితో దూరం పెరగడం, ఇలా ముందుకెళ్లలేక, వెనక్కి తగ్గలేక అడ కత్తెరలో పోక చెక్కలా తయారైంది జగన్ పరిస్థితి.
దీనికంతటికి వైఎస్ వివేకా హత్య కేసులో నిజనిజాలు తేలడానికి సీబీఐ చేస్తున్న విచారణ. గతంలో జరిగిన విచారణకు సంబంధించి సాక్ష్యులను బెదిరించి ఒప్పించారని తెలుస్తోంది. అయితే సీబీఐ అన్ని కోణాల్లో విచారణ జరుపుతోంది. దీనికి సంబంధించి కేసు మాత్రం ఎటు తిరిగి బంధువుల వద్దకు వచ్చి ఆగిపోవడం అనేది జగన్ కు తలనొప్పిగా మారుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి