తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి రేవంత్ రెడ్డి కెసిఆర్ పై బీఆర్ఎస్ పార్టీపై ఎదురు దాడి కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు అందరికీ టికెట్ ఇచ్చే దమ్ము కేసిఆర్ కు ఉందా అని ప్రశ్నిస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల పైనే ఆయనకు నమ్మకం లేదని ఆరోపించారు. దమ్ముంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అందరికీ టికెట్ ఇవ్వాలని రాజకీయ విమర్శలు చేశారు.


ఆల్రెడీ దళిత బంధు విషయంలో కొంతమంది ఎమ్మెల్యేలు లంచాలు తీసుకున్నట్టు కేసీఆర్ దగ్గర లిస్టు ఉందని స్వయంగా పార్టీ సమావేశంలో చెప్పడం సంచలనం కలిగించింది. దీనిపైన రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చ నడిచింది. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని రేవంత్ రెడ్డి కేసిఆర్ పై బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు  చేస్తున్నారు.


తద్వారా బీఆర్ఎస్ ని మానసికంగా దెబ్బ తీయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అదే సమయంలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో టికెట్లు దక్కని వారికి కాంగ్రెస్ అవకాశం ఇచ్చేందుకే ఇలా మాట్లాడుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో 30 నుంచి 35 స్థానాల వరకు గెలిచే అవకాశం ఉన్నట్టు నమ్ముతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు.


ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీపై రేవంత్ కొనసాగిస్తున్న ఎదురు దాడి, కర్ణాటక కాంగ్రెస్ గెలుపుతో రాష్ట్రంలో కాంగ్రెస్ కు ఊపు వచ్చింది. ఇదే విధానం కొనసాగిస్తే రాబోయే కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుంది. కేసిఆర్ కాదనుకుంటున్న ఎమ్మెల్యేలు ముందుగా బీజేపీ  వైపు కాకుండా కాంగ్రెస్ వైపు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ కు  క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం ఉండడం అదనపు బలం. కాబట్టి రేవంత్ రెడ్డి వేస్తున్న ఎత్తుగడలు సక్సెస్ అయితే కాంగ్రెస్ విజయం సులభం. మరి రేవంత్ రెడ్డి ఎత్తుగడలను కేసీఆర్ ఏ విధంగా ఎదుర్కొంటారు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: