రాజకీయాల్లో విధాన పరమైన నిర్ణయాలు ఉంటాయి.  స్పష్టత ఉండాలి. కానీ జగన్ కు ప్రస్తుతం అది లోపిస్తున్నట్లు కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు అమ్మఒడి పథకాన్ని ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ ఇస్తానని చెబుతున్నారు. 1500 చొప్పున అందరికీ 18 సంవత్సరాల నుంచి 56 సంవత్సరాల వరకు ఉన్న వారందరికీ ఇస్తానని చెప్పారు.  అలాగే కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన పథకాలను కాపీ కొడుతూ ప్రజలకు సేవ చేస్తానని చెబుతున్నారు.


ముఖ్యంగా ఆరు పథకాలు ఇస్తానని చెబుతూ ముందుకు సాగుతున్నారు. ఆ ఆరు పథకాలు ఇవ్వడం సాధ్యమవుతుందా లేదా అనేది తర్వాతి అంశం. కానీ అనకున్న విధంగా ముందు ఇస్తానని ప్రజలకు హామీ ఇవ్వడం ద్వారా పార్టీని గెలిపించుకోవచ్చు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఇలాగే ముందుకు కొనసాగుతున్నారు. కానీ సీఎం జగన్ మాత్రం గతంలో అధికారంలోకి రావడానికి నవరత్నాలు పథకాలను రాష్ట్ర పథకాలను ఇస్తానని చెప్పారు. కానీ దాంట్లో చాలా వరకు అమలు చేసిన రెండింటిని చేయలేకపోతున్నారు. ఒకటి మద్య పాన నిషేధం, రెండోది ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్.


ఈ రెండు పథకాల అమలులో చాలా వరకు లోపాలున్నాయి. ఏటా జాబ్ క్యాలెండర్ వేయడం ద్వారా ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చి వారి కుటుంబాలు బాగుపడతాయి. కానీ ఈ విషయంలో అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి దీన్ని అమలు చేయడం సాధ్యం కావడం లేదు. మద్య పాన నిషేధం కూడా  సాధ్యం కావడం లేదు.


ప్రస్తుతం చంద్రబాబు ఇస్తున్న హామీలు కూడా ఆచరణలో సాధ్యం కాకపోవచ్చు. కానీ ప్రజలకు ఇచ్చే హామీలు నెరవేర్చడానికి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి హామీలు ఇవ్వడానికి జగన్ ఎందుకు వెనక్కి వస్తున్నారో అర్థం కావడం లేదన్నది కొంత మంది రాజకీయ నిపుణుల అభిప్రాయం. ఇప్పటికే జగన్ హామీలతో రాష్ట్రం అప్పుల పాలైందని చెబుతున్న చంద్రబాబు అంతకంటే ఎక్కువ హామీలను ఎలా నెరవేర్చుతాడని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: